Ms Shetty Mr Polishetty OTT: ఆ ఓటీటీలోనే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి స్ట్రీమింగ్... ఎప్పుడంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈ మూవీ గురువారం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా డిజిటల్ పార్ట్ నర్, శాటిలైట్ పార్డ్ నర్ ను ఫిక్స్ చేసుకుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జాతీ రత్నాలు తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా వస్తున్న చిత్రం మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తోంది. ఇక తన కంటే తక్కువ వయసు ఉన్న హీరోతో అనుష్క నటిస్తోంది. ఈ సినిమాలో స్టాండ్ అప్ కమెడియన్ గా నవీన్ కనిపించగా.. అనుష్క 40 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోని షెఫ్ క్యారెక్టర్ లో కనిపించింది. ఇక ఈ మూవీ ఈరోజు రిలీజ్ కాగా.. మంచి టాక్ సొంతం చేసుకుంది.

రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి... సినిమాకు దర్శకుడు మహేశ్ బాబు తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రధన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం డిజిటల్ పార్ట్ నర్ ను, శాటిలైట్ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది.

ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీని ప్రముఖ ఓటిటి దిగ్గజం అయిన నెట్ ఫ్లిక్స్ డిజిటల్ హక్కులను దక్కించుకుందని తెలుస్తోంది. ఇక శాటిలైట్ రైట్స్ విషయానికి వస్తే.. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగు ఈ సినిమా కి సంబందించిన రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన 40 రోజులకు ఓటీటీలోకి రావొచ్చని అంటున్నారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఓటీటీ రిలీజ్ విషయంలో గట్టి పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ కోసం అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్ ప్లిక్స్ లు గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చివరకు ఈ సినిమా నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. నెట్ ప్లిక్స్ తో పాటు.. ఈమూవీ అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో అనుష్క దాదాపు 5 ఏళ్ల విరామం తరువాత ఎంతో ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఇప్పటికే ప్రిమియర్స్ టాక్ పాజిటివ్ గా వినిపిస్తోంది. స్వీటీ నటన అద్భుతమని.. ఏమాత్రం ప్రభావం తగ్గకుండా పెర్ఫామెన్స్ తో అదరగోట్టిందంటున్నారు. ఇక మొదటి రోజు ఈ సినిమా ఏ రేంజులో కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











