OTT: నెట్ ఫ్లిక్స్ తొలగించినా.. ఆ ఓటీటీలో నయనతార కాంట్రావర్సీ మూవీ స్ట్రీమింగ్
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి అందరికీ తెలిసిందే. అద్భుతమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ అలరించడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈమె ఓ సినిమా చేయగా అది వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా అన్నపూరణి అనే సినిమా చేసిన ఈమెకు అడుగడుగునా కష్టాలే ఎదురు అవుతున్నాయి. థియేటర్లలో ఈ సినిమా విడుదల చేసినప్పటి నుంచి అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక్కడి వరకూ అందరికీ తెలిసిందే.
ముఖ్యంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వేధికగా జనవరి 29వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమాపై రేగిన వివాదల కారణంగా ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగిస్తున్నట్లు తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించినప్పటికీ మరో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఇన్ని వివాదాలకు అడ్డాగా మారుతున్న ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్. ఆర్.రవీంద్రన్ సమర్పణలో నాస్ స్టూడియోస్ -ట్రైడెంట్ ఆర్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై జతిన్ సేథి, ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించాడు. నయనతార, జై, సత్యరాజ్, కెఎస్ రవికుమార్, ప్రధాన పాత్రల్లో నటించిన డిసెంబర్ ఒకట తేదీన విడుదల అయింది. బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దుమ్ము దులుపుతోంది. అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుళ్తుండగా.. భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరామ చంద్రమూర్తిని కించ పరిచేలా ఉందంటూ పలవురు కోర్టును ఆశ్రయించారు. దీంతో సినిమాను నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించాల్సి వచ్చింది.
ఈ సినిమాపై వివాదుల రేగడంతో మరింత ఎక్కువ మంది అసలు ఈ చిత్రంలో ఏముందో తెలుసుకోవాలని ఆతృత కనబరుస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకున్న సింప్లీ సౌత్ (Simply South) ఈ సినిమాను ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఈ సినిమాన తమ సింప్లీ సౌత్ ప్లాట్ ఫామ్ వేధికగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి నుంచే ఈ చిత్రాన్ని చూడవచ్చు అంటూ మేకర్స్ యే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ కాంట్రావర్సీ సినిమాను సింప్లీ సౌత్ లో చూడొచ్చు.

అయితే సినిమాపై పెద్ద ఎత్తున గొడవలు రావడానికి కారణం ఏంటంటే.. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి చెఫ్ అవ్వాలని అనుకుంటుంది. ఒక ఏజ్ వరకు కేవలం వెజ్ వంటకాలే చేసిన ఈమె.. ఇండియా నెంబర్ వన్ బెస్ట్ చెఫ్ అవ్వాలని హోటల్ మేనేజ్ మెంట్ లో శిక్షణ పొందుతుంది. అప్పుడే నాన్ వెజ్ చేయాలని అప్పుడే ఇండియన్ నంబర్ వన్ బెస్ట్ చెఫ్ అవ్వగలవని అంతా చెబుతారు. అలా నాన్ వెజ్ వంటలు చేసేందుకు ఆమె ముందుకు రావడం, మాంసాన్ని ముట్టుకోవడం.. వండడం చేస్తుంది. దీంతో పెద్ద ఎత్తున ఈ సినిమాపై విమర్శలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











