OTTలోకి వచ్చేసిన సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. చూడాలంటే కాస్త డేర్ ఉండాల్సిందే!
వీకెండ్ వచ్చేస్తోంది.. ఓటీటీలో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఈ వారం వచ్చిన కొత్త సినిమాల్లో సైకో క్రైమ్ థ్రిల్లర్ గాడ్ ఒకటి. నయనతార, జయం రవి కలిసి నటించిన చిత్రమే గాడ్. తమిళలంలో ఇరవైన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం.. తెలుగులోకి డబ్ అయింది. థియేటర్లలో ఆకట్టుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. మరి ఈ సినిమా కథేంటి.. ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయన తార, కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి కలిసి నటించిన తాజా చిత్రం ఇరైవన్. ఈ సినిమాకు ఐ.అహ్మద్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా సైకో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కింది. తమిళంలో ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అక్కడు ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇరైవన్ సినిమా రెండు వారాల తర్వాత టాలీవుడ్ లో రిలీజ్ అయింది. అక్టోబర్ 13వ తేదీన తెలుగులో రిలీజ్ అయింది. అయితే ఇరైవన్ సినిమా తెలుగులో గాడ్ గా రిలీజ్ అయింది. ఇక్కడ కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు ఈ సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ గాడ్ సినిమాను భారీ ధరకు విక్రయించింది. ఇక ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అక్టోబర్ 26వ తేదీ అర్ధరాత్రి నుంచే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ గాడ్ సినిమా అందుబాటులో ఉంది.
ఇక గాడ్ సినిమా విషయానికి వస్తే... నయనతార, జయం రవి కీలక పాత్రల్లో నటించారు. ఇక వీరితో పాటు... వినోద్ కిషన్, రాహుల్ బోస్, విజయ లక్ష్మి, నరైన్, ఆశిష్ విద్యార్థి, చార్లీ, అశ్విన్ కుమార్, భగవత్ పెరుమాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్. సతీష్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
గాడ్ సినిమా కథ విషయానికి వస్తే.. సిటీలో ఒక సైకో కిల్లర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి అతి క్రూరంగా చంపుతుంటాడు. అతనిని ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్.. స్నేహితుడు కలిసి పట్టుకోడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో నరైన్ చనిపోగా... దీనికి తోడు ఆ కిల్లర్‌ను పట్టుకున్న తర్వాత కూడా వరుసగా అమ్మాయిల హత్యలు జరుగుతుంటాయి. మరి అసలు వాళ్లని చంపేది ఎవరు? ఎందుకు ఇలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు? ప్రియ పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే గాడ్ సినిమా చూడాల్సిందే. ఇక థియేటర్లలో భయపెట్టిన ఈ సినిమా మీరు ఓటీటీలో ఎంచాక్క ఇంట్లోనే చూసేయండి.


Click it and Unblock the Notifications











