OTTలోకి నయనతార హార్రర్ మూవీ... ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి మరో హార్రర్ మూవీ రాబోతుంది. థియేటర్లలో రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయింది. ఆ సినిమా మరేదో కాదు.. కనెక్ట్. నయనతార నటించిన ఈ హర్రర్ మూవీ 2022లో డిసెంబర్ 22న రిలీజ్ అయింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి.. ఎందులో స్ట్రీమింగ్ అవ్వనుందనే వివరాలు ఈ స్టోరీ తెలుసుకుందాం.
లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలంటే చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఆమె ఏ సినిమా చేసిన.. అందులో ప్రత్యేకత ఉంటుంది. ఈ భామ గత ఏడాది జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ లోకి ఎంటర్ అయి సక్సెస్ అయింది. ఇలాంటి పాన్ ఇండియా సినిమాతో పాటుగా గత ఏడాది అన్నపూర్ణి అనే సినిమాలో కూడా నటించి మెప్పించింది.

నయనతార నటించిన ఈ అన్నపూర్ణి సినిమా ఫ్యామిలీ డ్రామాగా రూపొందింది. ఇటీవల ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాగా.. సూపర్ రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఓటీటీలో ఈ సినిమా మాత్రం దుమ్మురేపుతోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా రిలీజ్ అయిన ఈ సినిమా... నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ లో ఉంది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. నయన్ మరో మూవీ ఓటీటీలోకి రాబోతుంది. నయనతార నటించిన కనెక్ట్ మూవీ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
నయనతార నటించిన కనెక్ట్ మూవీ డిసెంబర్ 22, 2022న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ హారర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను పలకరించబోతున్నది. కరోనా టైమ్... లాక్ డౌన్ బ్యాక్ డ్రాప్ లో ప్రయోగాత్మకంగా కనెక్ట్ సినిమాను దర్శకుడు అశ్విణ్ శరవణన్ రూపొందించాడు. ఈ సినిమా కథ మొత్తం కంప్యూటర్స్ స్క్రీన్ ప్రధానంగా సాగనుంది.

ఇక ఈ కనెక్ట్ మూవీకి థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను, థియేట్రికల్ విడుదల ముందే నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. కానీ సినిమా థియేటర్లలో విడుదలై ఏడాదిపైనే అయినా ఇప్పటివరకు ఓటీటీలో మాత్రం విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. జనవరిలో రిపబ్లిక్ డే కానుకగా చివరివారంలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కనెక్ట్ ఓటీటీ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే... నయనతారతో పాటు వినయ్‌రాయ్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. అనుపమ్‌ఖేర్ అతిథి పాత్రలో నటించగా.. ఈ సినిమా కేవలం 99 నిమిషాలు మాత్రమే ఉండనుంది. కనెక్ట్ మూవీని నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మించగా... పెళ్లి తర్వాత నయనతార, విఘ్నేష్ శివన్ కలిసి చేసిన మొదటి సినిమా ఇది కావడం విశేషం. ఇక ఈ సినిమాలో దుష్ట ఆత్మ నుంచి తన కూతురిని కాపాడుకోవడానికి తల్లి చేసే పోరాటం నేపథ్యంగా ఈ మూవీ రూపొందింది.


Click it and Unblock the Notifications











