Unstoppable 2: మరోసారి త్రివిక్రమ్ తో మంతనాలు.. పవర్ స్టార్ తో వచ్చేది అప్పుడే
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ షో స్థాయి మరో లెవల్ కు వెళ్లే విధంగా ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఇప్పటికే చాలామంది సినీ తారలు రాజకీయ నాయకులు సినిమా టెక్నీషియన్స్ బాలకృష్ణ షోలో చేసిన సందడికి మంచి గుర్తింపు లభించింది. అయితే త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కూడా ఈ షోలోకి అడుగుపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసం ఆహా టీం ప్రత్యేకంగా ప్లాన్ కూడా రెడీ చేసినట్లు సమాచారం. ఇక ఆ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ గోపీచంద్ ఎపిసోడ్
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ సెకండ్ సీజన్ పేరుకు తగ్గట్టుగానే ముందుకు కొనసాగుతోంది. ఇప్పటివరకు స్ట్రీమింగ్ అయిన ప్రతి ఎపిసోడ్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక ప్రభాస్ గోపీచంద్ లతో కూడా ఒక ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు. ఇక క్రిస్మస్ సందర్భంగా ఆయన ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇటీవల విడుదలైన ప్రోమో కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మరో ప్రమోకోసమే ఇప్పుడు ఆడియన్స్ మరింత ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

రెగ్యులర్ గా కాకుండా
మొదటి సీజన్లోనే అనుకుంటే ఇప్పుడు రెండవ సీజన్లో అంతకుమించి అనేలా నందమూరి బాలకృష్ణ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాంటి స్టార్స్ వచ్చినా కూడా ప్రత్యేకంగా ఆయన వారితో మాట్లాడుతున్న విధానం కూడా హైలెట్ గా నిలుస్తోంది. రెగ్యులర్ గా కాకుండా వివాదాస్పద విషయాలపై కూడా బాలకృష్ణ స్పందిస్తున్న విధానం ఆసక్తిగా మారింది.

గతంలోనే త్రివిక్రమ్ తో ఫోన్ కాల్
అంతేకాకుండా ఈ సీజన్లో మరిన్ని సర్ ప్రైజ్ లు కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ షోలో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలోనే ఈ విషయంలో కొన్ని కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ఎందుకంటే బాలకృష్ణ ఆ మధ్య నిర్మాత నాగ వంశీ వచ్చినప్పుడు త్రివిక్రమ్ తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. షోలోకి ఎప్పుడు వస్తావు అని అడుగుతూనే.. ఎవరితో రావాలో తెలుసుగా.. అని కూడా అన్నాడు.

పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నప్పుడే..
త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మంచి మిత్రులు కాబట్టి బాలయ్య బాబు ఆ విధంగా కామెంట్ చేయడంతో తప్పకుండా వారిద్దరు వస్తారు అని ఫ్యాన్స్ అయితే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆహా టీమ్ అయితే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ ఎప్పుడో రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నప్పుడే త్రివిక్రమ్ ను కూడా తీసుకురావాలి అని ఆహా టీం సిద్ధమయ్యింది.

సంక్రాంతి ప్లాన్?
ఇక త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను సంక్రాంతి కానుకగా తీసుకు రావాలి అనే టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఈ ఏడాది చివరిలోపు వారికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే గనక నందమూరి బాలయ్య తో మాత్రం ఈ షో డిఫరెంట్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆహా స్థాయి కూడా మరొక లెవెల్ కు పెరుగుతుంది. మరి ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా ఆ ఎపిసోడ్ సంక్రాంతికి వస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











