OTT ఓటీటీలోకి చిరుత బ్యూటీ బోల్డ్ సిరీస్.. రాంచరణ్ హీరోయిన్ వెబ్ సిరీస్ ఎక్కడ? ఎలా చూడొచ్చంటే?
బాలీవుడ్ బ్యూటీ నేహా శెట్టి గురించి కుర్రాళ్లకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాతో హీరోయిన్ గా నేహా.. తెలుగులో అడుగుపెట్టింది. పొగరుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన పాత్రలో కనిపించి కుర్రాళ్లను పిచ్చేక్కించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నా.. అమ్మడికి మాత్రం ఆశించిన విజయాన్ని అందించలేదు. ఈ సినిమా తరువాత కుర్రాడు అనే సినిమాలో నటించింది. అది కూడా అటకెక్కడంతో.. చిన్నది మళ్లీ బాలీవుడ్ కు చెక్కేసింది.
బాలీవుడ్ లో కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ కాలం గడిపేస్తున్న సమయంలో సోషల్ మీడియా నేహను కాపాడింది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. అసలు అందాలను ఎలా ఆరబోయాలి.. ? ఎక్కడ చూపిస్తే కుర్రాళ్ళు కునుకు లేకుండా ఉంటారు అనేది నేహాకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదనే చెప్పాలి. చీరలో అయినా.. స్విమ్ సూట్ లోనైనా అమ్మడి అందాల ఆరబోత మాత్రం అస్సలు వదలదు. ఇక ఈమెకు తోడు ఈమె చెల్లి ఐషా శర్మ కలిసిందంటే.. ఆరోజు సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే.

ఇక ఒకపక్క అందాల ఆరబోత చేస్తూ, ఇంకోపక్క యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్న ఈ బ్యూటీ.. ఈ మధ్య ఓటీటీ లో వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. ఇప్పటికే ఇల్లీగల్ అనే హిందీ వెబ్‌సిరీస్‌లో లాయర్ పాత్రలో నేహా శర్మ నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈ చిన్నది 36 డేస్ అనే మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్ లో విమర్శకుల ప్రశంసలను అందుకున్న బోల్డ్ వెబ్‌సిరీస్ 36 డేస్ (36 days) ఆధారంగా ఈ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ తెరకెక్కుతుంది.
డైరెక్టర్ విశాల్ ఫ్యూరియా ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తుండగా.. పూరబ్ కోహ్లి, శృతి సేఠ్, చందన్ రాయ్ సన్యాల్, షరీబ్ హష్మి, అమృతా ఖాన్విల్కర్ కీలక పాత్రల్లో నటించారు. 36 డేస్ వెబ్‌సిరీస్‌ను అప్లౌజ్ ఎంటర్‌టైన్మెంట్, బీబీసీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఈ సిరీస్ పై ఎన్నో అంచనాలను క్రియేట్ చేసింది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. మొత్తం 8 ఎపిసోడ్స్ తో 36 డేస్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటివరకు డేట్ ను ప్రకటించని మేకర్స్.. 36 డేస్ (36 days Web Series) తాజాగా డేట్ ను ప్రకటిస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.

36 డేస్ సిరీస్ జూలై 12 నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఆరోజే అన్ని సీక్రెట్స్ బయటపడనున్నాయి అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాళీతో పాలు పలు భాషల్లో 36 డేస్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఇక ఈ సిరీస్ మొత్తం బోల్డ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. అందాల ఆరబోతతో నిత్యం సోషల్ మీడియాను షేక్ చేసే ఈ బ్యూటీ.. సిరీస్ లో మాత్రం అందాలను ఉంటుంది. ట్రైలర్ లోనే అమ్మడు బోల్డ్ క్యారెక్టర్ లో నటిస్తుందని అర్థమైపోయింది.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. నేహా ఈ సిరీస్ లో ఇంటిమేటెడ్ సీన్స్ లో కూడా నటించిందట. అవి క్లిక్ అయితే అమ్మడికి మంచి గుర్తింపు వస్తుందని అంటున్నారు. ఈ సిరీస్ కోసం నేహా బాగా కష్టపడినట్లు తెలుస్తోంది. మరి ఈ సిరీస్ తో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. అంతేకాకుండా ఈ సిరీస్ వలన నేహా తెలుగులో ఏమైనా మళ్లీ ఆఫర్స్ అందుకుంటుందేమో అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











