Nenu Super Women Show పారిశ్రామికవేత్త కావాలని ఉందా? స్టార్టప్ కంపెనీ పెట్టాలని ఉందా?

వినోద పరిశ్రమలో ఓటీటీల ప్రభావం ప్రేక్షకులపై భారీగా చూపిస్తున్నది. దాంతో విభిన్నమైన కంటెంట్, విలక్షణ కాన్సెప్టులతో ఓటీటీలో కొత్త కొత్త షోలతో ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఆహా ఓటీటీలో సరికొత్త కాన్సెప్ట్‌తో నేను సూపర్ ఉమెన్ అనే రియాలిటీ షోను ప్రారంభించడానికి రెడీ అయ్యారు. ఈ షో ద్వారా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, బిజినెస్ ఉమెన్స్‌కు స్పూర్తిని అందించేందుకు ప్లాన్ చేశారు. ఈ షో వివరాల్లోకి వెళితే..

మహిళా చైతన్యం, వికాసం లక్ష్యంగా దక్షిణాదిలోనే భారీ అంచనాలతో నేను సూపర్ ఉమెన్ అనే షోను ప్రారంభించడానికి ఆహా ఓటీటీ సిద్దమైంది. ఇప్పటికే వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తున్న యువ పారిశ్రామికవేత్తలు ఈ రియాలిటీ షోలో మెంటర్స్, గైడ్‌గా ఉండబోతున్నారు. జూలై 21వ తేదీన ప్రారంభం కాబోతున్న ఈ షో ఆహా ఓటీటీలో ప్రతీ శుక్ర, శనివారం స్ట్రీమింగ్ అవుతుంది.

Nenu Super Women Business Reality Show to stream on AHA OTT

ఆహా ఓటీటీలో ప్రసారం కాబోతున్న నేను సూపర్ ఉమెన్ రియాలిటీ షోకు సింగర్, యాక్టర్ శ్రీరామచంద్ర హోస్ట్‌గా వ్యవహరిస్తారు. ఏంజెల్స్ అనే ప్యానల్‌లో డార్విన్ బాక్స్ అధినేత రోహిత్ చెన్నమనేని, క్వాంటెలా ఇంక్ వ్యవస్థాపకుడు శ్రీధర్ గాది, సిల్వర్ నీడిల్ వెంచర్స్ భాగస్వామి రేణుక బొడ్ల, అభిబస్ సీఈవో, వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి, దొడ్ల డైరీ వ్యవస్థాపకులు దీపారెడ్డి దొడ్ల, బజాజ్ ఎలక్ట్రానిక్స్‌కు చెందిన కరణ్ బజాజ్, నారాయణ కాలేజ్ డైరెక్టర్ సింధూర పొంగూరు ఉంటారు.

నేను సూపర్ ఉమెన్ రియాలిటీ షోలో ఏంజెల్స్ ప్యానెల్‌లో ఉన్న పారిశ్రామిక వేత్తలు ఔత్సాహిక వ్యాపారవేత్తలకు సలహాలు, సూచనలు, గైడెన్స్ అందిస్తారు. ఈ రియాలిటీ షోలో గెలిచిన వారికి ఆర్థిక సహాయం అందించడానికి 1.35 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేశారు. ఔత్సాహిక బిజినెస్ ఉమెన్స్‌కు ఆర్థిక సాయంతోపాటు సలహాలు అందించడానికి అవకాశం ఉంది.

Nenu Super Women Business Reality Show to stream on AHA OTT

తెలుగు రాష్ట్రాల్లో కొత్త శకానికి ఇదొక నాంది. నేను సూప‌ర్ ఉమెన్ అనే రియాలిటీ షో మహిళా సాధికార‌త‌ను పెంపెందించే ఓ అసాధార‌ణ‌మైన వేదిక‌. మ‌హిళ‌ల్లోని ప్ర‌తిభ‌, వ్యాపార నైపుణ్యాల‌ను బ‌య‌ట పెడుతుంది.ఇత‌ర మ‌హిళ‌ల వ్యాపారాల్లో భాగమయ్యి, వారి ఆశయాలను నెరవేర్చే ఇలాంటి కార్య‌క్ర‌మంలో నేను భాగం కావ‌టం అనేది గౌర‌వంగా భావిస్తున్నాను అని పలువురు మెంటర్స్ అభిప్రాయపడ్డారు.

వి హ‌బ్ (V Hub) అనేది తెలంగాణ ప్ర‌భుత్వ చొర‌వ‌తో రూపుదాల్చింది. నేను సూప‌ర్ Iమెన్ షో చాలా మంది మ‌హిళ‌ల‌కు స్ఫూర్తినిస్తుంది. కొత్త కొత్త విష‌యాల రూప‌క‌ల్ప‌న‌ల‌ను ప్రోత్స‌హిస్తుంద‌ని న‌మ్ముతున్నాం. వ్యాపారంలో రాణించాల‌నుకుంటున్న మ‌హిళ‌లు, వారి ఆలోచ‌న‌లు గురించి తెలుసుకునే గొప్ప అవ‌కాశం నేను సూపర్ ఉమెన్ ప్రొగ్రాం ద్వారా ద‌క్కింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X