OTT: నెట్ ఫ్లిక్స్ పండుగ.. 2025లో వారి దగ్గరున్న తెలుగు, తమిళ భారీ సినిమాలివే..

ఒక్క ఇండియా లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా మంచి పాపులర్ అయ్యినటువంటి ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థల్లో నెంబర్ 1 ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కోసం అందరికీ తెలిసిందే. కాగా నెట్ ఫ్లిక్స్ లో సాలిడ్ కంటెంట్ తక్కువ ధరలోనే ఎక్కువ క్వాలిటీతో దొరుకుతుంది అని వరల్డ్ వైడ్ ఆడియెన్స్ లో మంచి పేరు ఉంది.

కాగా మన దేశంలో కూడా నెట్ ఫ్లిక్స్ కి మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో వీరు ఎప్పటికప్పుడు క్రేజీ వెబ్ సిరీస్ లని అలాగే సినిమాలని కూడా దింపుతూ ఉంటారు. కాగా ప్రతీ ఏడాది ప్రతీ నెల ప్రతీ వారం కూడా కొత్త కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు నెట్ ఫ్లిక్స్ లో వస్తూనే ఉంటాయి. అంతే కాకుండా దాదాపు భారీ సినిమాలు అన్నీ కూడా వీరే రికార్డు ధర ఇచ్చి కొనేస్తూ ఉంటారు.

netflix announced biggies of 2025 telugu and tamil here is what are they

పైపెచ్చు నెట్ ఫ్లిక్స్ అంటే గ్లోబల్ రీచ్ కూడా బాగా ఉంటుంది అని అందరిలో చాలా నమ్మకం ఉంది. ఈ క్రమంలోనే ఈ 2025 కొత్త ఏడాదిలో సంక్రాంతి కానుకగా వారు సొంతం చేసుకున్న సినిమాలు ఏంటి అనేది ఇప్పుడే రివీల్ చేయడం స్టార్ట్ చేశారు. కాగా టాలీవుడ్ సహా కోలీవుడ్ సినిమాల ఉన్నటువంటి భారీ సినిమాలు అది కూడా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న సినిమాలనే వీరు కొనేసి యూనానిమస్ గా నిలిచారు అని చెప్పాల్సిందే.

కాగా ఈ సినిమాల్లో చూసినట్టు అయితే మొదట మన తెలుగు నుంచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా "ఓజి" తో స్టార్ట్ చేశారు. ఆ సినిమా పాన్ ఇండియా హక్కులు సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేసి దీనితో పాటుగా నాని నటిస్తున్న క్రేజీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా "హిట్ 3" అలాగే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమాని కూడా వీరే సొంతం చేసుకున్నారు.

netflix announced biggies of 2025 telugu and tamil here is what are they

ఇవే కాకుండా నాగ చైతన్య, సాయి పల్లవి నటిస్తున్న భారీ సినిమా "తండేల్" మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న "మాస్ జాతర" అలాగే కామెడీ ఎంటర్టైనర్ "మ్యాడ్ 2" లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లనే నెట్ ఫ్లిక్స్ తెలుగు నుంచి లాక్ చేసేసింది. ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే అక్కడ కూడా పలు భారీ సినిమాలే సొంతం చేసుకున్నారు.

వీటిలో ముఖ్యమైనవి చూస్తే థలా అజిత్ చేస్తున్న ప్రెజెంట్ రెండు సినిమాలూ "గుడ్ బ్యాడ్ అగ్లీ" అలాగే "విడా ముయర్చి" రెండు సినిమాలు వీరే తీసేసుకోగా యూనివర్సల్ హీరో కమల్ హాసన్ అలాగే దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సినిమా "థగ్ లైఫ్" సినిమాని కూడా కొనేశారు. ఇక రీసెంట్ గానే టీజర్ తో సెన్సేషన్ రేపిన సూర్య సినిమా "రెట్రో" కూడా కొన్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో ఇలా తెలుగు సహా తమిళ్ నుంచి దాదాపు ఎన్ని అవైటెడ్ సినిమాలు ఉన్నాయో అన్నీ నెట్ ఫ్లిక్స్ చేతిలో పెట్టుకొని తమ ఆడియెన్స్ కి నిజంగానే పండుగ అందించేలా ఉందని చెప్పి తీరాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X