Rana Naidu 2: త్వరలో వచ్చేస్తున్న రానా నాయుడు 2.. మరింత అడల్ట్ కంటెంట్‌తో!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బాబాయ్ అబ్బాయిగా మంచి ఫామ్ లో ఉన్న నటులు వెంకటేష్, దగ్గుబాటి రానా. వీళ్లిద్దరు కలిసి ఒకేసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు. వెంకటేష్, రానా ఇద్దరు తండ్రీ కొడుకులుగా కలిసి నటించిన ఈ సిరీస్ మార్చి 10న ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ పై అనేక రకాలుగా విమర్శలు వచ్చినప్పటికీ మంచి విజయం సాధించింది. అయితే తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

గ్యాప్ తర్వాత హాట్ బ్యూటి : ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ పాపులర్ అమెరికన్ సిరీస్ 'రే డోనోవర్' కు ఇండియన్ అడాప్షన్ వెర్షన్ గా రానా నాయుడు సిరీసును నిర్మించారు. బాలీవుడ్ హాట్ బ్యూటి సుర్విన్ చావ్లా చాలాకాలం గ్యాప్ తర్వాత ఇందులో తళుక్కుమంది. ఇక ఆశిష్ విద్యార్థి, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య మీనన్, ముకుల్ చద్దా తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Rana Naidu 2

ఆడియెన్స్ అసహనం : రానా నాయుడు వెబ్ సిరీస్ ను హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేశారు. మార్చి 10 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన రానా నాయుడు వెబ్ సిరీస్ పై తెలుగు ప్రేక్షకులు కాస్తా అసహనం వ్యక్తం చేశారు. ఇందులో ఎక్కువగా బూతులు, శృతిమించిన అడల్ట్ కంటెంట్ ఉందని సినీ సెలబ్రిటీలు సైతం ఆరోపించారు.

రెండో సీజన్ పై : ఫ్యామిలీ హీరోగా స్టార్ బ్రాండ్ తెచ్చుకున్న వెంకటేష్ తో అలా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పించడం పట్ల పెదవి విరిచారు. దీంతో ఈ సిరీస్ పై నెగెటివిటీ ఏర్పడ్డ కమర్షియల్ గా మాత్రం మంచి విజయం సాధించింది. ఎన్ని విమర్శలు, నెగెటివిటీ వచ్చిన కూడా రానా నాయుడు వెబ్ సిరీస్ కు అత్యధిక వ్యూస్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ క్రమంలో దీని రెండో సీజన్ పై అందరి దృష్టి పడింది.

నెట్ ఫ్లిక్స్ ప్రకటన : ఇక మొదటి సీజన్ ఎండింగ్ లో కూడా దానికి హింట్ ఇచ్చారు. అధికంగా బోల్డ్ కంటెంట్, బూతులు, యాక్షన్, ఇంటిమేట్ సీన్లతో కలబోసిన ఈ సిరీస్ కు రెండో సీజన్ రావాలని ప్రేక్షకులు సైతం కోరుకున్నారు. ఈ క్రమంలోనే అధికారికంగా రానా నాయుడు 2 వస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

Rana Naidu 2

మరింత డ్రామా..: "వర్రీ అవ్వకండి. మీ కిరి కిరిలను (సమస్యలను) పరిష్కరించేందుకు నాయుడులు తిరిగి వస్తున్నారు. త్వరలో రానా నాయుడు సీజన్ 2 రానుంది" అని ట్వీట్ ద్వారా తెలిపింది. ట్వీట్ లో ప్రకటిస్తూ వీడియో కూడా షేర్ చేసింది. అయితే ఈ వీడియో మొదటి సీజన్ కు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే చూపించారు. ఇక మరెన్నో ట్విస్టులు, మరింత ఫ్యామిలీ డ్రామా, బోల్డ్ కంటెంట్ తో రానా నాయుడు ఉండనుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X