Devara OTT: చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. అన్ని కోట్ల ఓటీటీ డీల్‌తో దేవర రికార్డు

తెలుగు సినీ ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అందులోనూ కొందరైతే గ్లోబల్ రేంజ్‌కు ఎదిగిపోయారు. అలాంటి వారిలో నందమూరి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. కొంత కాలంగా వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. ఇప్పుడు ఫుల్ జోష్‌లో 'దేవర' అనే క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోన్న విషయం తెలిసిందే.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న పవర్‌ఫుల్ యాక్షన్ మూవీనే 'దేవర'. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో హై రేంజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇండియాలోనే ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రాబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి దాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తున్నారు.

Recommended Video

Devara OTT చరిత్ర సృష్టించిన Jr NTR.. Pushpa 2 రికార్డ్ బ్రేక్ | Allu Arjun | Telugu Filmibeat

Netflix Bagged Jr NTR Starrer Devara Movie Digital Rights With Huge Amount

ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న 'దేవర' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా దీన్ని షూట్ చేస్తున్నారు. ఇలా ఇప్పటికే 85 శాతం కంటే ఎక్కువగానే టాకీ పార్టును పూర్తి చేసేశారు. అదే సమయంలో ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్‌ను కూడా స్టార్ట్ చేశారు.

సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోతున్న 'దేవర' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇటీవలే మ్యూజిక్ రైట్స్‌ను టీ సిరీస్‌ సంస్థకు భారీ మొత్తానికి అమ్మింది. ఇక, తాజాగా ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను బడా సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

Netflix Bagged Jr NTR Starrer Devara Movie Digital Rights With Huge Amount

ఫిలిం నగర్ ఏరియా సమాచారం ప్రకారం.. 'దేవర' డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ దాదాపు రూ. 155 కోట్లు మొత్తాన్ని చెల్లించిందట. ఇది ఎన్టీఆర్ సోలో కెరీర్‌లోనే (RRR కాకుండా) టాప్ రికార్డు అని తెలుస్తోంది. అదే సమయంలో 'పుష్ప 2' రికార్డును కూడా ఇది బ్రేక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న 'దేవర' మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇందులో శ్రీకాంత్, చాకో సహా తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X