Saripodha Sanivaaram: చరిత్ర సృష్టించిన నాని.. అన్ని కోట్ల డీల్‌తో షాకిచ్చాడుగా!

నేచురల్ యాక్టింగ్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు నాని. అదే సమయంలో విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ ఎన్నో విజయాలను కూడా అందుకున్నాడు. దీంతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతోన్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో అయితే వరుస హిట్లతో ఈ నేచురల్ స్టార్ ఫుల్ ఫామ్‌తో సత్తా చాటుతున్నాడు.

గత ఏడాది 'దసరా', 'హాయ్ నాన్న' వంటి హిట్లను అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే సినిమాను చేస్తున్నాడు. 'అంటే సుందరానికీ' మూవీ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని రూపొందిస్తున్నారు.

 Netflix Bagged Nani Starrer Saripodha Sanivaaram Movie Digital Rights

నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కలిసి చేస్తున్న 'సరిపోదా శనివారం' మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును చిత్ర యూనిట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ఈ చిత్రాన్ని మరికొన్ని నెలల్లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

సరికొత్త సబ్జెక్టుతో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఇటీవలే గ్లింప్స్ వీడియో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభించింది. ఫలితంగా ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ఆ వెంటనే చిత్ర యూనిట్ బిజినెస్ కార్యక్రమాలను మొదలు పెట్టేసి కొన్ని రైట్స్ కూడా అమ్మేసింది. దీనిపై తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది.

నాని హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తాజాగా తెలిసింది. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా రూ. 45 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది నాని కెరీర్‌లోనే టాప్ ఓటీటీ డీల్ అని సమాచారం. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ ప్రముఖులను సైతం షాక్‌కు గురి చేస్తుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా.. నాని - వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కుతోన్న 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేస్తున్నారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఈ ఏడాది మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X