OG: ఓటీటీ రికార్డు కొట్టిన పవన్ కల్యాణ్.. టాప్ మూవీగా ఓజీ సంచలనం

తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్ ఎక్కువగా ఉన్న హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకడు. ఆ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన అతడు.. ఇటీవలి కాలంలో మాత్రం వరుసగా సినిమాల మీద సినిమాలను చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్నో మూవీలలో నటిస్తున్నాడు.

ఈ మధ్య కాలంలో ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోన్న పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

Netflix Bagged Pawan Kalyan Starrer OG Movie Digital Rights With Huge Price

పవర్‌ఫుల్ యాక్షన్‌తో రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా షెడ్యూళ్లను జరుపుకుంటూ వచ్చారు. ఇలా ఇప్పటి వరకూ 50 శాతం కంటే ఎక్కువ టాకీ పార్టునే పూర్తి చేసుకున్నారు. మిగిలిన దాన్ని కూడా పవన్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేస్తారు.

సరికొత్త సబ్జెక్టుతో రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ నుంచి ఆ మధ్య గ్లింప్స్ వీడియో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభించింది. ఫలితంగా ఈ చిత్రంపై ఉన్న అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ఆ వెంటనే చిత్ర యూనిట్ బిజినెస్ కార్యక్రమాలను మొదలు పెట్టేసి కొన్ని రైట్స్ కూడా అమ్మేసింది. దీనిపై తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది.

Netflix Bagged Pawan Kalyan Starrer OG Movie Digital Rights With Huge Price

పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న 'సరిపోదా శనివారం' మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తాజాగా తెలిసింది. ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా రూ. 90 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇది పవన్ కెరీర్‌లోనే టాప్ ఓటీటీ డీల్ అని సమాచారం. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ ప్రముఖులను సైతం షాక్‌కు గురి చేస్తుందని చెప్పొచ్చు.

ఇదిలా ఉండగా, 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X