Salaar: ఫేమస్ ఓటీటీలో సలార్ మూవీ.. ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్ డీల్ ఇదేనట
హీరోగా పరిచయం అయిన తర్వాత చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించి.. 'బాహుబలి' చిత్రం నుంచి పాన్ ఇండియాపై మార్కెట్‌పై ప్రభావాన్ని చూపిస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అప్పటి నుంచి భారీ చిత్రాల్లో మాత్రమే నటిస్తోన్న అతడు.. అన్ని ఇండస్ట్రీల్లో తన మార్కెట్‌ను మరింతగా పెంచుకుంటోన్నాడు. అదే సమయంలో వరుసగా మూవీలు చేస్తున్నాడు.
ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తైంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

క్రేజీ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక, ఇప్పుడు చిత్ర యూనిట్ బిజినెస్ తదితర కార్యక్రమాలపై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ డీల్‌ను క్లోజ్ చేసుకుందని తెలిసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సలార్' మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌కు అప్పుడే భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుందట.
'సలార్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా కొన్ని కోట్ల రూపాయలను చెల్లించినట్లు తెలిసింది. దీంతో ఆ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిన అతి తక్కువ చిత్రాల్లో 'సలార్' ఒకటిగా నిలిచిందని అంటున్నారు. అంతేకాదు, ప్రభాస్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ అని కూడా తెలిసింది. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్‌లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











