Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Waltair Veerayya OTT: వాల్తేరు వీరయ్య ఆ ఓటీటీలోనే.. స్ట్రీమింగ్ డేట్‌పై క్లారిటీ
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూనే ఉన్నారు. ఇలా ఇప్పటికే ఆయన పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ రేంజ్‌లో అలరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' అనే మాస్ యాక్షన్ మూవీని చేశారు. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించిన ఈ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెరకెక్కించాడు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని శుక్రవారమే (జనవరి 13వ తేదీ) ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.
ఘాటు ఫొటోతో టెంప్ట్ చేస్తోన్న దీప్తి సునైనా: కింది నుంచి చూపిస్తూ హాట్‌గా!
రిలీజ్‌కు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న 'వాల్తేరు వీరయ్య' మూవీ ఈరోజే ఎంతో వైభవంగా విడుదలైంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1500లకు పైగా థియేటర్లలో విడుదల చేశారురు. దీంతో అన్ని థియేటర్లూ మెగా అభిమానులు, ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఇక, ఈ సినిమాకు టాక్ మాత్రం మిశ్రమంగా వస్తోంది. కొందరు ఈ సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరు ఏవరేజ్ అంటున్నారు. అయినా స్పందన మాత్రం ఓ రేంజ్‌లోనే ఉంది.

క్రేజీ కాంబోలో రూపొందిన 'వాల్తేరు వీరయ్య' హక్కుల కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఈ మూవీ డిజిటిల్ రైట్స్ కోసం చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ సంస్థ చిరంజీవి సినిమా ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుందని టైటిల్ కార్డ్సులో క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం సదరు సంస్థ కొన్ని కోట్ల మొత్తాన్ని అందజేసినట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక, ఈ చిత్రాన్ని విడుదలకు యాభై రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేస్తారని కూడా తెలిసింది. అంటే ఇది ఫిబ్రవరి నెలాఖరులో కానీ మార్చి ఫస్ట్ వీక్‌లో కానీ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
షర్ట్ విప్పేసి రెచ్చిపోయిన నిధి అగర్వాల్: ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా ఏంటీ!
చిరంజీవి, రవితేజ కలయికలో వచ్చిన ఎంటర్‌టైనర్ మూవీనే 'వాల్తేరు వీరయ్య'. టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ భారీ చిత్రంలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటించారు.