twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Adipurush నెట్‌ఫ్లిక్స్ చేతికి ఓటీటీ రైట్స్.. ప్రభాస్ మూవీకి ఇండియాలోనే రికార్డు డీల్

    |

    బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్, యంగ్ రెబల్ ‌స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఆదిపురుష్ చిత్రం రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు, నటీనటులు రెమ్యురేషన్లు సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. చారిత్రాత్మక నేపథ్యంతో రాముడి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ వివరాల్లోకి వెళితే..

    ఐమాక్స్ ఫార్మాట్‌లో ఆదిపురుష్

    ఐమాక్స్ ఫార్మాట్‌లో ఆదిపురుష్

    ఆదిపురుష్ సినిమా దక్షిణాదిలోని అన్ని భాషలతోపాటు హిందీలో కూడా నిర్మిస్తున్నారు.భారీ రేంజ్‌లో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ ఉండటంతో ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పీరియడ్ నేపథ్యంగా వచ్చిన బాహుబలి, RRR కంటే భారీ బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను రూపొందిస్తుండటం విశేషంగా మారింది.

    కృతిసనన్ సీత పాత్రలో

    కృతిసనన్ సీత పాత్రలో

    ఆదిపురుష్ చిత్రాన్ని టీ సీరిస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార్, ఓం రావత్ కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నారు. ఇంకా చాలా మంది ప్రతిభావంతులైన నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు.

    బాహుబలి, RRR కంటే ఎక్కువగా

    బాహుబలి, RRR కంటే ఎక్కువగా

    ఆదిపురుష్ నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఇండియాలోనే ఇప్పటి వరకు ఈ సినిమాకు జరగని బిజినెస్ నమోదవుతున్నది. ఇప్పటి వరకు కేజీఎఫ్2 160 కోట్లు, సాహో 215 కోట్లు, రాధేశ్యామ్ 275 కోట్లు, RRR 310 కోట్ల బిజినెస్ చేసింది. ఆది పురుష్ చిత్రం వీటన్నిటిని మించి 500 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక నాన్ థియేట్రికల్ బిజినెస్ సాధించిన చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది.

     నెట్‌ఫ్లిక్స్ చేతికి ఆదిపురుష్ ఓటీటీ రైట్స్

    నెట్‌ఫ్లిక్స్ చేతికి ఆదిపురుష్ ఓటీటీ రైట్స్

    ఇక ఆదిపురుష్ డిజిటల్ బిజినెస్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ భారీ రేటు చెల్లించి సొంతం చేసుకొన్నది.ఈ సినిమాను 250 కోట్లు చెల్లించి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ దక్కించుకొన్నట్టు సమాచారం.

    ప్రపంచవ్యాప్తంగా 17 వేల స్క్రీన్లలో రిలీజ్

    ప్రపంచవ్యాప్తంగా 17 వేల స్క్రీన్లలో రిలీజ్

    ఆది పురుష్ చిత్రం మొత్తంగా 15 భాషల్లో అది పురుష్ మూవీని పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 వేలకు పైగా స్క్రీన్లలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రేంజ్‌లో సినిమా రిలీజ్ అయితే రికార్డు కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా 2023, జనవరి 12 తేదీన రిలీజ్ అవుతున్నది.

    English summary
    Prabhas's Adipurush movie has reportedly landed Indian cinema's greatest digital deal ever. Netflix is said to have bought the film's digital rights across languages by shelling out Rs 250 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X