80 కోట్ల బడ్జెట్.. రెండేళ్ల షూటింగ్.. విడుదలకు ముందు నిలిపివేత!
Baahubali: భారతీయ సినిమా చరిత్రలో 'బాహుబలి'సిరీస్ కు ప్రత్యేక స్థానం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న ఇండియన్ సినిమా .. మరో 100 సంవత్సరాల తర్వాత కూడా బాహుబలి గురించి ప్రస్తావించాల్సిందే. అలాంటి సంచలన విజయం సొంతం చేసుకుంది బాహుబలి 1, బాహుబలి 2 సిరీస్. అయితే .. బాహుబలి సిరీస్ కు ఫ్రీక్వల్ గా 'బాహుబలి- బిఫోర్ ది బిగినింగ్' ను నెట్ ప్లిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ప్రస్తుతం కనిపించడం లేదు. తాజాగా ఈ భారీ ప్రాజెక్టుపై ఓ నటుడు షాకింగ్ విషయాలను బయట పెట్టాడు. వివరాల్లోకెళ్తే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కిన మూవీ 'బాహుబలి'. ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్పటివరకు 100 కోట్లు.. 200 కోట్లు.. వసూలు చేస్తే అది గొప్పగా భావించేవారు. అలాంటిది బాహుబలి సినిమా దాదాపు 1900 కోట్లు వసూలు చేసింది. కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్దనే 1400 కోట్ల వసూలు చేసి బాక్సాఫీస్ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అయితే.. ఈ బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న ఈ మూవీకి ఫ్రీక్వల్ గా బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ (baahubali: before the beginning) అనే సిరీస్ ను గతంలో నెట్ ప్లిక్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీని ఆనంద్ నీలకంఠను రచించిన 'ది రైజ్ ఆఫ్ శివగామి', 'క్వీన్ ఆఫ్ మాహిష్మతి' అనే నవల ఆధారంగా 'బాహుబలి- బిఫోర్ ది బిగినింగ్' తెరకెక్కిస్తున్నామని నెట్ ప్లిక్స్ అప్పట్లో ప్రకటించింది. అయితే.. భారీ తారాగణం కాకుండా.. ఇందులో ప్రధాన పాత్రలో మృనాల్ ఠాకూర్, రాహుల్ బోస్, అతుల్ కులకర్ణి వంటి తదితర నటులు కీలక పాత్రలో నటించబోతున్నారని ప్రకటించారు. కానీ, ఈ సినిమా సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇప్పటివరకు రాలేదు.
తాజాగా ఈ సినిమాపై బాలీవుడ్ నటుడు బిజయ్ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాహుబలి బ్రేక్వెల్ ఫై షాకింగ్ విషయాలను వెల్లడించారు. 'నెట్ క్లిప్స్ తెరకెక్కిస్తున్న ఓ సాధారణ షో లో భాగంగా బాహుబలి ఫ్రీక్వెల్ ను తెరకెక్కించబోతున్నారని భావించాను. అందుకే మొదట నిరాకరించాను. సినిమాలు చేయాలనుకున్నాను. కానీ కరణ్ కుంద్రా నిర్ణయాన్ని పునరాలోచించమని నన్ను కోరాడు. ఆ కోరిక మేరకు అంగీకరించాను. దాదాపు రెండు సంవత్సరాల పాటు హైదరాబాదులో జరిగిన షూట్ లో పాల్గొన్నాను. అయితే రెండేళ్ల తర్వాత నెట్ ప్లిస్ ఈ షోను పక్కన పెట్టడమే ఉత్తమమని భావించింది, దీంతో ఆ షో ను రిలీజ్ చేయకుండానే వదిలేసింది నెట్ ఫ్లిక్స్.' అని వెల్లడించారు.

'బాహుబలి ప్రిక్వెల్ కోసం దాదాపు 80 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. రెండు సందర్భాల్లోనూ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ విడుదలకు సరిపోదని చెప్పారు. ఇందులో నేను కీలక పాత్ర పోషించాను. ఈ షో షూటింగ్ సమయంలో నాకు సాహో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో ఆ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది' అని నటుడు బిజయ్ ఆనంద్ తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. బాహుబలి ఫ్రీక్వెన్ రిలీజ్ చేయకపోవడానికి అసలు కారణమేంటి? అని నెట్టింట్లో తెగ వెతుకున్నారు బాహుబలి ఫ్యాన్స్. ఏదిఏమైనా.. ఈ విషయం ప్రభాస్, బాహుబలి ఫ్యాన్స్ కు మింగుడు పడని విషయమే.


Click it and Unblock the Notifications











