Pushpa 2 The Rule OTT Release : పుష్ప 2 ఓటీటీ మరింత ఆలస్యం?.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ , రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్ తదితరులు నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2. మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప పార్ట్ 1కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. బాహుబలి 2, కేజీఎఫ్ 2 తర్వాత ఈ మధ్యకాలంలో యావత్ దేశం ఇంతలా ఎదురుచూసిన చిత్రం పుష్ప 2 అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం గతేడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం నాలుగు నెలలు ఆలస్యంగా రిలీజైంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 వేల థియేటర్‌లలో విడుదలైన పుష్ప 2 ది రూల్ .. నార్త్ , సౌత్ అన్న తేడా లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
పుష్ప 2 విడుదలయ్యాక ఎన్నో సినిమాల రికార్డులు అడ్రస్ లేకుండా పోతాయని ట్రేడ్ పండితులు ముందుగానే ఊహించారు. దానిని నిజం చేస్తూ రికార్డుల దుమ్ముదులుపుతోంది. తొలి వారంలోనే దాదాపు రూ. 1000 కోట్ల వసూళ్లను సాధించి భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్‌ను సాధించిన సినిమాగా నిలిచింది. అంతేకాదు 2024లో హయ్యెస్ట్ వసూళ్లు సాధించిన స్త్రీ 2, కల్కి 2898 ఏడీలను అల్లు అర్జున్ క్రాస్ చేశాడు.

రెండ్రోజుల క్రితం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 (రూ.1810 కోట్లు) కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టింది. బాహుబలి 2 తన టోటల్ రన్ టైంలో ఈ ఫీట్ అందుకుంటే.. పుష్ప 2 మాత్రం కేవలం 32 రోజుల వ్యవధిలోనే టార్గెట్ కొట్టేసింది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో టాప్‌లో ఉన్న అమీర్ ఖాన్ నటించిన దంగల్‌ను వెనక్కి నెట్టాలని పుష్ప 2 భావిస్తోంది.
అంతా బాగానే ఉంది కానీ.. పుష్ప 2ని ఓటీటీలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఫిలింనగర్‌లో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం పుష్ప 2 డిజిటల్ హక్కులను రికార్డు స్థాయిలో రూ. 250 కోట్లకు కొనుగోలు చేసిందట. తాము పెట్టిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకునేందుకు గాను పుష్ప 2ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోందట. కానీ థియేట్రికల్ రన్ పూర్తి అవుతుందని అంతా అనుకున్న టైంలో పుష్ప 2 మేకర్స్ తెలివిగా పావులు కదిపారు. పండగ సీజన్ క్యాష్ చేసుకునేందుకు గాను మరో 20 నిమిషాల ఫుటేజ్‌ని యాడ్ చేసి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. ట్రైలర్‌లో చూపించిన కొన్ని షాట్స్‌ను సినిమాకు యాడ్ చేస్తారని టాక్. దీంతో వీటి కోసం పుష్ప లవర్స్ మరోసారి థియేటర్లకు పోటెత్తుతారని ప్రచారం జరుగుతోంది.

ఓటీటీ నిబంధనల ప్రకారం థియేటర్‌లో విడుదలైన 56 రోజుల తర్వాత సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయొచ్చు. దీని ప్రకారం జనవరి నెలాఖరులో అంటే ఈ నెల 29న పుష్ప 2 ఓటీటీలో విడుదల కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత పుష్ప 2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది.


Click it and Unblock the Notifications











