OTT: దెబ్బకు దిగొచ్చిన నెట్ ఫ్లిక్స్.. దుమారం రేపిన వెబ్ సిరీస్ కి మార్పులు.. ఏంటా సిరీస్?

ఒక్క ఓవర్సీస్ దేశాల్లోనే కాకుండా మన దేశంలో కూడా ఇప్పుడు ఓటిటి కంటెంట్ కి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. కాగా మన దేశంలో మన కంటెంట్ తో సహా ఓవర్సీస్ నుంచి వచ్చే కంటెంట్ కి కూడా మంచి ఆదరణ ఉండగా వీటిని అందించే క్రమంలో పలు టాప్ మోస్ట్ ఓటిటి సంస్థలు కొన్ని సార్లు కాంట్రవర్సీ లలో కూడా ఇరుకుంటున్నారు. కాగా రీసెంట్ గా ఇలానే వరల్డ్ వైడ్ మంచి పాపులార్టీ ఉన్న స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు వరుస కాంట్రావర్సీలలో ఇరుక్కుంటున్నారు.

నెట్ ఫ్లిక్స్ లో ఇండియా లో కూడా భారీ సంఖ్యలో జెన్యూన్ యూజర్లు ఉన్నారు కానీ ఇండియన్స్ మనోభావాలనే దెబ్బ తీసే కంటెంట్ ని ప్రోత్సహిస్తే ఊరుకుంటారా? ఇప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. గతంలో తమిళ నటి నయనతార నటించిన "అన్నపూరణి" అనే సినిమాలో మన హిందుత్వంన్నీ కించపరిచేలా డైలాగులు ఉన్నాయని నెట్ ఫ్లిక్స్ నుంచి ఆ సినిమాని తీసేసిన వరకు ఊరుకోలేదు.

netflix finally changed IC 814 Kandahar Hijack real names with huge pressure by indians

కాగా ఇప్పుడు మళ్ళీ దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాల్లో అజాగ్రత్తగా ఉంటే ఎలా ఉంటుందో మళ్ళీ నెట్ ఫ్లిక్స్ కి భారతీయులు రుచి చూపించారు. కాగా రీసెంట్ గా కొన్ని రోజులు కితమే నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి ఓ హిందీ వెబ్ సిరీస్ పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఆ సిరీస్ నే "ఐసి 814 కాందహార్ హైజాక్".

మరి ఈ వెబ్ సిరీస్ నిజంగా ఇండియాకి చెందిన విమానం 1999 లో హైజాక్ అయ్యిన సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఈ వెబ్ సిరీస్ చూసిన భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటిలో ఈ హైజాక్ ని చేసింది ముస్లింలు అయితే వారి పేర్లు మతాలు మార్చేసి వేరే పేర్లు ఎందుకు పెట్టారని సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

netflix finally changed IC 814 Kandahar Hijack real names with huge pressure by indians

తరాలకి తప్పుడు సమాచారం అందిస్తున్నారు అని నెట్ ఫ్లిక్స్ ని బాయ్ కాట్ చెయ్యాలని పెద్ద దుమారమే రేపారు. కాగా ఇలా గత కొన్ని రోజులు నుంచి సంచలనంగా మారుతూ వస్తున్న అంశంపై ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ దిగి వచ్చింది. అంతా డిమాండ్ చేస్తున్నట్టుగా ఆ హైజాక్ చేసిన వారి అసలు పేర్లని పొందు పరిచింది. దీనితో ఫైనల్ గా భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చరిత్రని కించపరిచే విధంగా వ్యవహరిస్తే ఏ ఓటిటి విషయంలో అయినా సరే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ గా చెబుతున్నారు. సో మొత్తానికి ఇలా నెట్ ఫ్లిక్స్ తలొగ్గాల్సి వచ్చింది. ఇక ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వెర్మ, తమిళ నటుడు అరవింద స్వామి ఇంకా బాలీవుడ్ నటుడు నజీరుద్దీన్ సిద్దికీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటిటిలో గట్టిగానే ట్రెండ్ అవుతూ భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ఇక ఇప్పుడు ఎలాగో తప్పులు కరెక్ట్ చేశారు కాబట్టి మరింత రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X