నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో 'గ్లోరీ' హవా.. అసలు ఈ సిరీస్‌లో ఏముంది?

సాంకేతిక నైపుణ్యత అందుబాటులోకి వచ్చిన తర్వాత వినోద రంగంలో అనేక మార్పులు వేగంగా చోటు చేసుకొంటున్నాయి. ఎక్కువ మంది థియేటర్లకు దూరంగా ఉంటూ ఓటీటీలోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఓటీటీలో వ్యూవర్ షిప్ రేటింగ్ చూస్తే వాటికి ఎంత క్రేజ్ ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తున్నది. ముఖ్యంగా క్రైమ్, సైకాలజికల్, సస్సెన్స్ థ్రిల్లర్లపై ప్రేక్షకులు మోజు డుతున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ రంగంలో టాప్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన టాప్ 10 సినిమాల వెబ్ సిరీస్ డేటాను వెల్లడించింది. ఇటీవల రిలీజై ఆడియెన్స్‌ను ఆకట్టుకొంటున్న గ్లోరి (Glory) వెబ్ సిరీస్ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తాజాగా టాప్ ట్రెండింగ్ వెబ్ సిరీస్ వివరాల్లోకి వెళితే..

నెట్‌ఫ్లిక్స్ వెల్లడించిన డేటా చూస్తే సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నదనే విషయం స్పష్టమైంది. నెట్‌ఫ్లిక్స్ వెల్లడించిన టాప్ 10 వెబ్ సిరీస్‌లలో నాలుగు సిరీస్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో 1. గ్లోరి, 2. హీరామండి, 3. సైతాన్, 4. సిటీ హంటర్ ఉన్నాయి. గ్లోరీ విషయానికి వస్తే.. సస్పెన్స్ థ్రిల్లర్ కాగా, హీరామండి పిరియాడిక్ డ్రామా, సైతాన్ హారర్ ఎలిమెంట్స్‌తో ఉన్న మిస్టరీ డ్రామా కాగా, సిటీ హంటర్ యాక్షన్ మిస్టరీగా రూపొందింది.

Netflix India Top 10 Why Glory Thriller Series is Dominating the Charts in May 2026 - Must Watch

టాప్ ట్రెండింగ్ వెబ్ సిరీస్‌లను పరిశీలిస్తే.. భాష, ప్రాంతం లేకుండా ఆడియెన్స్ కంటెంట్‌ను ఆదరిస్తున్నారు. దేశీయ కంటెంట్‌నే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన సిరీస్‌లను ఇష్టపడుతున్నారు. సబ్ టైటిల్స్ కూడా అందుబాటులోకి రావడంతో ఒరిజినల్ భాషలోను వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. దాంతో గ్లోబల్, లోకల్ స్టార్స్‌ను చూస్తూ ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు.

గ్లోరి వెబ్ సిరీస్‌కు ఎక్కువగా యువత నుంచి ఆదరణ లభిస్తున్నది. గ్రిప్పింగ్‌గా కథలను నేరేట్ చేసే వాటిని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. ఆడియెన్స్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను అందుబాటులోకి తెస్తున్నది. ఇటీవల కాలంలో థ్రిల్లర్ జోనర్‌కు భారీగా డిమాండ్ పెరిగిందని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఓ వైపు గ్లోరీ సంచలనాలు క్రియేట్ చేస్తుంటే.. మరిన్ని కొత్త వెబ్ సిరీస్‌లను అందించేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నది. రానున్న వారాల్లో మరిన్ని హై-వోల్టేజ్ కంటెంట్ కోసం ఆడియన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X