ఖాకీ: ది బీహార్ చాప్టర్.. రియల్ హీరోపై అవినీతి ఆరోపణలు.. ఏం జరిగిందంటే?

'ఖాకీ: ది బీహార్ చాప్టర్' అనే వెబ్ సిరీస్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సీరీస్ కు మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఆ సీరీస్ విడుదల తర్వాత బీహార్ కేడర్ IPS అధికారి అమిత్ లోధాపై ఒక్కసారిగా ప్రశంసలు కురిశాయి. ఎందుకంటే ఆయన జీవిత ఆధారంగా ఈ సీరీస్ ను రూపొందించారు. అయితే అలాంటి ఆఫీసర్ పై ఇపుడు అవినీతి నిరోధక చట్టం ఇతర IPC సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

దీంతో ఒక్కసారి ఆయన పేరు మరోసారి మీడియాలో వైరల్ గా మారింది. అమిత్ లోధా రాసిన పుస్తకం 'బీహార్ డైరీస్: ది ట్రూ స్టోరీ ఆఫ్ హౌ బీహార్ మోస్ట్ డేంజరస్ క్రిమినల్ వాజ్ క్యాచ్' కు మంచి గుర్తింపు లభించింది. అయితే ఆ పుస్తకం ఆధారంగానే నెట్ ఫ్లిక్స్ ఖాకీ అనే వెబ్ సిరీస్ నిర్మించింది. ఇక అది విడుదలైన కొన్ని రోజులోకే ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోయింది. షేక్‌పురా అలాగే దాని చుట్టుపక్కల జిల్లాల్లో అత్యంత దారుణమైన నేరాలకు పాల్పడిన ఒక పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ కథ.

Netflix Khakee The Bihar Chapter famed IPS officer booked under PC Act

ఇక అలాంటి వారిని అమిత్ టీమ్ ఎలా అడ్డుకుంది అనేది సీరీస్ లోని అసలు కథ. అయితే ఇటీవల హఠాత్తుగా బీహార్ పోలీస్ స్పెషల్ విజిలెన్స్ యూనిట్ విడుదల చేసిన పత్రికా ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. లోధాపై పలు సెక్షన్స్ కింద అవినీతి ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఆరోపణల కారణంగా ఆయనపై ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది.

Netflix Khakee The Bihar Chapter famed IPS officer booked under PC Act

లోధా వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన అధికారిక పదవిని దుర్వినియోగం చేశారని ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు స్వలాభం కోసం ఆర్థిక లాభాల కోసం ప్రయత్నం చేయడం నేరమే అవుతుందని అంటున్నారు. ఇక ఆయన నెట్‌ఫ్లిక్స్, అలాగే ప్రొడక్షన్ హౌస్ ఫ్రైడే స్టోరీ టెల్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా కూడా లోధాపై అభియోగాలు మోపారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రముఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ ను నియమించారు. ఇక ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X