OTT: ఇలా షాక్ ఇచ్చావేంటి నెట్ ఫ్లిక్స్ మావా.. భలే మోసం చేశావుగా!

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ టు హాలీవుడ్ మూవీస్ అన్ని అందులో ఉంటాయి. బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే పేరు కూడా ఉండేది.. ఇక ఈ మధ్య తెలుగు సినిమాలు బాగానే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏ కొత్త సినిమా రిలీజ్ అయినా.. నెట్ ఫ్లిక్స్ కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తుంది. అయితే ఓ విషయంలో దారుణంగా మూవీ లవర్స్ ను నెట్ ఫ్లిక్స్ మోసం చేసింది. ఆ విషయం తెలుసుకుని ఇలా షాక్ ఇచ్చావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ వేదికగా ఎన్నో సినిమాలు, సిరీసులు రిలీజ్ అవుతాయనే విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలాయళ, హిందీ భాషలే కాకుండా ఇంగ్లీష్ డ్రామాలు, సిరీసులు, సినిమాలు అన్ని ఇందులో అందుబాటులో ఉంటాయి. అప్పట్లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్య కాలంలో నెట్ ఫ్లిక్స్ సినిమాకు మంచి హైప్ వస్తే కొనుగోలు చేసేస్తుంది.

Netflix OTT Shock to Movie Lovers about Leo Movie Streaming Full Details Here

చాలా మంచి సినిమాలు నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక మూవీ లవర్స్ కూడా డబ్బులు ఎక్కువ ఉన్నా సరే.. నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ తీసుకుని సినిమాలు చూస్తున్నారు. అయితే ఇదిలా ఉండగా.. నెట్ ఫ్లిక్స్ మూవీ లవర్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. వచ్చే వారంలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టును పెట్టింది నెట్ ఫ్లిక్స్. ఆ లిస్టును చూసిన మూవీ లవర్స్ అంతా సంతోషించారు. దానికి కారణం అందులో లియో సినిమా ఉంది.

ఇక లియో నవంబర్ 21న రిలీజ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. ఇక ఇది చూసిన మూవీ లవర్స్ అంతా.. విజయ్ నటించిన లియో సినిమా ఓటీటీలోకి రాబోతుందని సంతోషించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా.. ఓటీటీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక లియో సినిమాను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది కాబట్టి.. ఆ సినిమానే అంతా అనుకున్నారు.

కానీ తీరా చూస్తే ఈ లియో.. విజయ్ లియో కాదని తేలింది. హాలీవుడ్ నటుడు ఆడమ్ శాండ్లర్ యానిమేటెడ్ మ్యూజికల్ కామెడీ సినిమా లియో. ఇక ఈ సినిమా నవంబర్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ చెప్పింది. ఈ యానిమేషన్ చిత్రానికి రాబర్ట్ మరియానెట్టి, డేవిడ్ వాచెన్‌హీమ్, రాబర్ట్ స్మిగెల్ దర్శకత్వం వహించారు. ఒక బల్లి, తాబేలు ఓ పాఠశాలలో చిక్కుకునే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.

Netflix OTT Shock to Movie Lovers about Leo Movie Streaming Full Details Here

అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇది చూసిన ఇండియా ఫ్యాన్స్ అంతా దళపతి విజయ్ మూవీ అనుకున్నారు. ఇప్పుడు అసలు విషయం తెలుసుకున్న మూవీ లవర్స్... నెట్ ఫ్లిక్స్ భలే మోసం చేసిందని కామెంట్స్ పెడుతున్నారు. ఇక విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వచ్చిన లియో మూవీ డేట్‌ ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X