OTT: "లక్కీ భాస్కర్" అఫీషియల్ ఎంట్రీ.. ఎన్ని భాషల్లో ఎపుడు ఎందులో అంటే?
ఈ ఏడాదిలో తెలుగు సినిమా దగ్గర పండుగల సీజన్లలో మంచి సినిమాలు అది కూడా కొన్ని కాంట్రవర్సీ లతో కూడా వచ్చినవి ఉన్నాయని చెప్పాలి. దాదాపు సంక్రాంతి నుంచి మొన్న దీపావళి వరకు వచ్చిన సినిమాల లిస్ట్ లో దాదాపు అన్ని క్లాష్ లలో కూడా ఒకో సినిమాతో పాటు మరో సినిమా యూనిట్ లతో కోల్డ్ వార్స్ కూడా జరిగాయి.
కాగా మొన్న దీపావళికి వచ్చిన చిత్రాల్లో కూడా ఓ రెండు సినిమాలు విషయంలో ఇదే రచ్చ నడిచింది. అయితే గత పండుగలు కంటే ఈ దీపావళికి వచ్చిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యి భారీ వసూళ్లు ప్లస్ లాభాలు కూడా అందించాయి. ఇలా సాలిడ్ వసూళ్లు అందుకున్న చిత్రాల్లో తెలుగు సినిమా "లక్కీ భాస్కర్" కూడా ఒకటి.

మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించగా.. ఈ దీపావళి బ్లాక్ బస్టర్ గా నిలిచి రూ.111 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. ఈ సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత కొంచెం అండర్ పెర్ఫామ్ చేసింది అని టాక్ వచ్చింది. దీనితో ఓటిటి విడుదల కూడా కొంచెం త్వరగానే ఉండొచ్చు అనే మాట కూడా వినిపించింది.
అయితే ఇంట్రెస్టింగ్ గా తర్వాత సినిమా కొంచెం పికప్ అయ్యి ఇప్పటికీ బాగానే రన్ అవుతుంది. దీనితో నెల రోజుల ఫార్మాట్ లోనే సినిమా వస్తుంది అని టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాతో పాటుగా దీపావళికి మరో రెండు సినిమాలు వస్తే వాటిలో కన్నడ చిత్రం కేవలం మూడు వారాల్లోనే ఓటిటిలో దర్శనం ఇచ్చింది. కాగా ఇది కాకుండా మరో తెలుగు సినిమా క్రేజీ థ్రిల్లర్ హిట్ "క" కూడా వచ్చింది.
ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఈటీవీ విన్ వారు ఇచ్చేసారు. ఇక ఫైనల్ గా లక్కీ భాస్కర్ డేట్ కూడా వచ్చేసింది. కాగా ఈ చిత్రాన్ని ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా వీరు లేటెస్ట్‌గా దీనిపై డేట్ ఇచ్చేసారు. మరి ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం కూడా మొన్న "క" తో పోటిగానే థియేటర్స్ లో ఎలా వచ్చిందో ఇపుడు ఓటిటిలో కూడా సేమ్ డేట్ లో వచ్చేందుకు సిద్ధం అయ్యింది.
కాగా నెట్ ఫ్లిక్స్ లో లక్కీ భాస్కర్ ఈ నవంబర్ 28న వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. అయితే మిగతా సినిమాల్లా కాకుండా ఈ పాన్ ఇండియా ఓటిటిలో దిగుతుండటం విశేషం. ఒరిజినల్ తెలుగు, డబ్బింగ్ వెర్షన్ లు కన్నడ, మలయాళం, తమిళ్ సహా హిందీ భాషల్లో మొత్తం ఇలా పాన్ ఇండియా వైడ్‌గా లక్కీ భాస్కర్ రాబోతున్నాడు అని చెప్పాలి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి దుల్కర్ సరసన హీరోయిన్ గా నటించగా త్రివిక్రమ్, నాగ వంశీలు నిర్మాణ బాధ్యతలు వహించారు.


Click it and Unblock the Notifications











