నెట్‌ఫ్లిక్స్‌లో HIT 3 హవా .. వరల్డ్ వైడ్‌గా ఏ దేశాల్లో ట్రెండింగ్ అవుతుందో తెలుసా?

సినిమా హిట్ అయ్యిందా? లేదా? అన్న దానికి గతంలో కొన్ని కొలమానాలు ఉన్నాయి. ఎన్ని సెంటర్లలో 100 రోజులు ఆడింది? ఎన్ని సెంటర్లలో 175 రోజులు ఆడింది? వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకునేవారు. ఆ తర్వాత సెంటర్స్ పోయి కలెక్షన్స్ వచ్చాయి. తొలి రోజు ఎంత ఓపెనింగ్స్ కొట్టింది? లాంగ్ రన్‌లో ఎంత కలెక్ట్ చేసింది? అన్న దానిపై సినిమా హిట్టా? ఫట్టా అనేది చెబుతున్నారు. ఇప్పుడు ఓటీటీల రాకతో మరో రికార్డు కూడా ఇండస్ట్రీలో కనిపిస్తోంది. సినిమా ఏయే దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది? ఎన్ని కోట్ల వ్యూస్ సాధించింది అనే కొత్త లెక్కలు కనిపిస్తున్నాయి.

ఓటీటీలో హిట్ 3 సరికొత్త చరిత్ర

హిట్ ఫ్రాంఛైజ్‌లో భాగంగా డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన మూవీ హిట్ ది థర్డ్ కేస్ .. హిట్ 3. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మరోసారి నానికి 100 కోట్ల కలెక్షన్స్ అందించిన చిత్రంగా నిలిచింది. ఇటీవల హిట్ 3 ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ క్రమంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ వివరాల్లోకి వెళితే..

Netflix revealed that Nani s HIT 3 has Trending in the global streaming charts

హిట్‌ 3కి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్

సూర్య శ్రీనివాస్, రావ్ రమేశ్, సుముద్రఖని, కోమలీ ప్రసాద్, నెపోలియన్, ప్రతీక్ బబ్బర్ తదితరులు హిట్‌ 3లో కీలకపాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించగా.. సాను జాన్ వర్గీస్‌ సినిమాటోగ్రఫీ అందించారు. దాదాపు రూ.60 కోట్ల బడ్జెట్‌‌తో ఈ సినిమా నిర్మాణం జరిగింది. అలాగే హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా 48.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్, రూ.54 కోట్లకు డిజిటల్ రైట్స్, రూ.6 కోట్లకు ఆడియో రైట్స్, రూ.12 కోట్లకు శాటిలైట్ రైట్స్ సేల్ అయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

నానికి మరో 100 కోట్ల చిత్రం

ఇక హిట్ 3 కలెక్షన్స్ విషయానికి వస్తే .. 31 రోజుల వరకు ఇండియాలో రూ.80.82 కోట్ల నెట్, రూ.94.32 కోట్ల గ్రాస్ రాబట్టింది. నానికి ఓవర్సీస్‌లో ఉన్న మార్కెట్ దృష్ట్యా ఈ సినిమాకు అక్కడ రూ.25 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ వసూళ్లు కలిపి హిట్ 3కి ప్రపంచవ్యాప్తంగా రూ.119.32 కోట్లు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలోకి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మే 29 నుంచి హిట్ 3 ఓటీటీలో అందుబాటులో ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.

ఓటీటీలో టాప్ ట్రెండిగ్‌లో హిట్ 3

ఓటీటీలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే హిట్ 3 దుమ్మురేపుతోంది. నాని పవర్‌ఫుల్ యాక్టింగ్‌కు తోడు కథ, కథనానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్‌లో సక్సెస్ అయిన విధంగానే నెట్‌ఫ్లిక్స్‌లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే టఫ్ కాంపిటీషన్‌లోనూ నెట్‌ఫ్లిక్స్ ఇండియాలో నెం 1గా ట్రెండ్ అవుతోన్న హిట్ 3 .. వరల్డ్ వైడ్‌గా 7వ స్థానంలో ఉంది. అలాగే 7 దేశాల్లో నెం 1గా, 23 దేశాల్లో టాప్ 10గా హిట్ 3 ట్రెండ్ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ మంచి వ్యూయర్‌షిప్ సాధించిన నాని చిత్రం రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Read more about: netflix natural star nani hit 3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X