OTT: డైరెక్ట్ గా ఓటిటిలో రాజమౌళి బయోపిక్.. ఏ ఓటీటీలో? ఎప్పుడు రిలీజ్ అంటే?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థల్లో ఒకటైన నెట్ ఫ్లిక్స్ కోసం అందరికీ తెలిసిందే. కాగా ఇందులో వరల్డ్ వైడ్ గా కూడా మంచి పాపులర్ కంటెంట్ అది కూడా తక్కువ డేటాతో మంచి క్వాలిటీ స్ట్రీమింగ్ ని ఇది అందిస్తుంది. దీనితో కొంచెం కాస్ట్లీ అయినా కూడా నెట్ ఫ్లిక్స్ కి మంచి డిమాండ్ ఉంది. మరి ఇదే నెట్ ఫ్లిక్స్ మూలాన ఫేట్ మారిపోయిన ఇండియన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా అనే చెప్పి తీరాలి.

దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్ హీరోలు రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లతో తెరకెక్కించిన ఈ మాసివ్ మల్టీస్టారర్ థియేటర్స్ లో కంటే ఓటిటిలో వచ్చాకే అది కూడా నెట్ ఫ్లిక్స్ వచ్చిన తర్వాతే వరల్డ్ వైడ్ ఒక ఊహించని రేంజ్ రీచ్ ని సొంతం చేసుకుంది.

netflix to release ss rajamouli s biographical picture here is the details

అయితే అయితే దీనికి ముందు రీజనల్ భాషల్లో జీ 5 లో వచ్చింది కానీ హిందీలో ఎప్పుడైతే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చిందో అపుడే అన్ని సమీకరణాలు మారాయి. హీరోలకి ఊహించని రీచ్ సినిమాకి ఊహించని రీచ్ అలాగే దర్శకుడు రాజమౌళి కూడా హాలీవుడ్ దర్శకులు కూడా కొనియాడే రేంజ్ రీచ్ అంతా నెట్ ఫ్లిక్స్ పుణ్యమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఇలా రాజమౌళి జీవితంలో ఒక ముఖ్య పాత్ర పోషించిన ఈ దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ ఇప్పుడు అదే రాజమౌళితో ఒక స్పెషల్ ప్లానింగ్ తో రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. కాగా తాజాగా నెట్ ఫ్లిక్స్ దర్శకుడు రాజమౌళి పై ఓ డాక్యుమెంటరీ సినిమాని అనౌన్స్ చేయడం ఇప్పుడు విశేషంగా మారింది. కాగా ఓ దర్శకుడి విషయంలో ఇలా డాక్యుమెంటరీ అనౌన్స్ చేయడం ఇండియన్ సినిమా దగ్గర ఇదే తొలిసారి కూడా కావచ్చు.

కాగా ఇప్పుడు అసలు ఇది ఎప్పుడు నుంచి స్ట్రీమ్ అవుతుంది మొత్తం ఎంత సేపు ఉంటుంది అనేవి కూడా రివీల్ అయ్యాయి. కాగా ఈ స్పెషల్ డాక్యుమెంటరీని ఈ రానున్న ఆగస్ట్ 2 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ డాక్యుమెంటరీకి మోడ్రన్ మాస్టర్స్: ఎస్ ఎస్ రాజమౌళి అంటూ టైటిల్ ని కూడా పెట్టి మొత్తం ఒక గంట 14 నిముషాలు నిడివితో తీసురానున్నట్టుగా ఇప్పుడు ఖరారు చేశారు.

మరి ఈ ఓటిటి సినిమా ఎలా ఉంటుందో ఇందులో ఎలాంటి స్పెషల్ ఫీచర్స్ కనిపిస్తాయో అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే కొందరు ప్రముఖ నటులు కూడా దీని పట్ల ఎగ్జైట్ అవుతున్నారు. కాగా ఇప్పుడు జక్కన్న అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తన కెరీర్ 29 వ చిత్రాన్ని రాజమౌళి పాన్ వరల్డ్ లెవెల్లో డైరెక్ట్ చేయనున్నారు.

More from Filmibeat

Read more about: ss rajamouli netflix mahesh babu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X