నెట్ ఫ్లిక్స్ లో దుమ్ము రేపుతున్న కొత్త సినిమాలు... నెంబర్ వన్ లో ట్రెండ్ అవుతున్న డిజాస్టర్ మూవీ
ప్రతి వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కంటెంట్ ఎలా మారుతూ ఉంటుందో అలాగే టాప్ 10 లో ట్రెండ్ అయ్యే సినిమాల లిస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఆయా సినిమాలకు వచ్చే వ్యూస్ ను బట్టి ట్రెండ్స్ లో వాటి స్థానాన్ని నిర్ణయిస్తారు. మరి ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న టాప్ 10 సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.
1. బడే మియాన్ చోటే మియాన్
భారతదేశాన్ని టెర్రరిస్ట్ నుంచి కాపాడే సైనికులుగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ఈ మూవీలో నటించారు. భారీ బడ్జెట్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ మూవీ థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఈ డిజాస్టర్ మూవీ ఓటిటిలో మాత్రం మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. గత ఐదు రోజుల నుంచి ఈ మూవీ టాప్ 10 లోనే ఉండడం విశేషం.

2. అండర్ ప్యారిస్
ఇదొక హాలీవుడ్ మూవీ. రీసెంట్ గానే ఓటీటీలోకి అడుగుపెట్టిన స్టోరీ ఏంటంటే.. సెయిన్‌లో ప్రపంచ ట్రయాథ్లాన్ ఛాంపియన్‌షిప్‌లను నిర్వహిస్తోంది. సోఫియా అనే తెలివైన శాస్త్రవేత్త మీకా అనే యువ పర్యావరణ కార్యకర్త ద్వారా ఒక పెద్ద సొర చేప నదిలో ఉందనే విషయాన్ని తెలుసుకుంటుంది. అయితే ఈ ఈవెంట్ లో రక్తపాతాన్ని ఆమె ఎలా ఆపింది అనేది స్టోరీ.
3. క్రూ
తమ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయాణాన్ని మొదలు పెట్టిన ముగ్గురు సాధారణ ఎయిర్ హోస్టెస్ లు అనుకొని ఇబ్బందుల్లో పడతారు. ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేదే క్రూ స్టోరీ. ఇందులో టబూ, కరీనా కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషించారు. గత 18 రోజుల నుంచి ఈ మూవీ టాప్ ట్రెండింగ్ సినిమాల లిస్టులో ఉంది. అంతేకాదు 2024లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అతి తక్కువ బాలీవుడ్ సినిమాలలో ఇది కూడా ఒకటి.
4. హిట్ మాన్
ఇదొక క్రైం థ్రిల్లర్ మూవీ. ఒక ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ కిల్లర్ తన క్లైంట్ తోనే ప్రేమలో పడతాడు. అయితే అతను ఆమెను వేధించే తన భర్తను చంపాలి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ.

5. లపాతా లేడీస్
అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన చిన్న సినిమా లపాతా లేడీస్. ట్రైన్ లో ఇద్దరు యువ వధువులు అనుకోకుండా మారిపోవడంతో ఏం జరిగింది అనే ఈ మూవీ స్టోరీ ఉల్లాసభరితంగా, ఊహించని పరిణామాలతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చిన్న సినిమా అయినప్పటికీ ఇది థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఈ మూవీ ఓటీటీలోకి వచ్చి దాదాపు 46 రోజులు అవుతున్నా, ఇంకా ట్రెండింగ్ లో ఉండడం విశేషం.
ఇక ఈ లిస్ట్ లో గాడ్జిల్లా మైనస్ వన్ మూవీ టాప్ 6లో, సైతాన్ టాప్ 7లో, ఆర్టికల్ 370 టాప్ 8లో, సేఫ్ హౌస్ మూవీ టాప్ 9లో, బాకీ హనుమ వర్సెస్ కెంగన్ అసుర టాప్ 10లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











