OTT: నెట్ ఫ్లిక్స్ లో టాప్ ట్రెండింగ్ 10 సినిమాలు.. ఈ సర్వైవల్ థ్రిల్లర్ ని ట్రై చెయ్యండి..
ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ అయ్యినటువంటి ప్రముఖ ఓటిటి సంస్థలు కొన్ని ఉన్నాయి. మరి ఈ అన్నిటిలో కూడా నెంబర్ 1 స్ట్రీమింగ్ యాప్ ఏది అంటే అది ఖచ్చితంగా నెట్ ఫ్లిక్స్ అని చెప్పొచ్చు. కాగా నెట్ ఫ్లిక్స్ లో ప్రతి వారం ఏదొక కొత్త కంటెంట్ ని వారు దింపుతూ ఉంటారని తెలిసిందే. అలా ఈ ఏడాదిలో కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు అలాగే వెబ్ సిరీస్ లని కూడా వీరు తీసుకొచ్చారు.
కాగా నెట్ ఫ్లిక్స్ కి మన ఇండియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అంతే కాకుండా మన నుంచి కూడా వీరికి మంచి రెవెన్యూలు వెళుతూ ఉంటాయి. కాగా ఇప్పుడు మన దేశంలో ప్రెజెంట్ ట్రెండింగ్ లిస్ట్ లో అయితే పలు చిత్రాలు నిలిచాయని చెప్పాలి. కాగా ఇప్పుడు ఇండియా వైడ్ గా టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు ఏంటి వాటిలో డెఫినెట్ గా చూడాల్సినవి రీసెంట్ గా వచ్చిన సినిమాలు ఏంటి అనేవి చూస్తే..

మొదటిగా టాప్ 10 స్థానాల్లో మొదటిగా విజయ్ నటించిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ప్రస్తుతం ఇండియా వైడ్ గా ట్రెండింగ్ లో నిలిచింది. ఇక 2 వ స్థానంలో అనన్య పాండే CTRL(సిటీఆర్ఎల్), 3. జాన్వీ కపూర్ ఉలాజహ్, 4.సరిపోదా శనివారం, 5. ది ప్లాట్ ఫామ్ 2, 6. సెక్టార్ 36, 7. ట్రబుల్, 8. లాపతా లేడీస్, 9. ది ఫైనల్ డెస్టినేషన్ 10. మహారాజ సినిమాలు ట్రెండింగ్ లో నిలిచాయి.
అయితే ఈ టాప్ 10 లో లాస్ట్ మూడు సినిమాలు పక్కన పెట్టేయవచ్చు. ఇక మిగిలిన ఏడింటిలో చూస్తే ఫ్రెష్ కంటెంట్ ని చూడాలి అనుకునేవారికి మాత్రం టాప్ 5వ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న "ది ప్లేట్ ఫామ్ 2" మంచి ఛాయిస్ గా నిలుస్తుందని చెప్పాలి. చాలా బోల్డ్ గా అండ్ డిస్టబింగ్ గా సాగే ఈ సినిమాని గాల్దెర్ గాజ్తెలు - ఉఱుతిలా మునిట్క్ష దర్శకత్వం వహించారు.
వందల అపార్ట్మెంట్స్ నడుమ ఒకటే ప్లేట్ ఫామ్ లా ఖైదీలకు ఫుడ్ వస్తుంది. మొదటి నుంచి చివరి వరకు ఆ ఫుడ్ కోసం జరిగే పోరాటం అలాగే అక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి అనే కాన్సెప్ట్ లో మంచి సర్వైవల్ థ్రిల్లర్ గా ఇది కనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే 18 ప్లస్ లో కూడా ఉంటాయి. సో బెటర్ ఒకరే ట్రై చేస్తే బెటర్ అని చెప్పాలి. అలాగే దీనికి ముందు ప్లాట్ ఫామ్ 1 అనే సినిమా కూడా ఉంది.

ఇది కూడా నెట్ ఫ్లిక్స్ లోనే ప్రసారం అవుతుంది. సో మొదట అది చూసి ఇది నెక్స్ట్ ట్రై చేస్తే ఇంకొంచెం బెటర్ గా అనిపించవచ్చు. కానీ ఆ సినిమా అయితే దీని కంటే దారుణంగా ఉంటుందని చెప్పాలి. మనుషులనే మనుషులు తినేయడం, దారుణంగా చంపుకోవడం వంటి సన్నివేశాలు మిమ్మల్ని డిస్టబ్ చేస్తాయి సో ఆలోచించి ఈ క్రేజీ సర్వైవల్ థ్రిల్లర్స్ ని ట్రై చేస్తే బెటర్.
కాగా ఈ సినిమాలు తెలుగు డబ్బింగ్ లో అయితే అందుబాటులో లేవు. ఒరిజినల్ గా ఇవి స్పానిష్ భాషకి చెందినవి ఇంగ్లీష్ అలాగే హిందీ డబ్బింగ్ వెర్షన్ లు ఇందులో అందుబాటుకి ఉన్నాయి సో సబ్ టైటిల్స్ తో మంచి సర్వైవల్ థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే వీటిని ట్రై చేయవచ్చు.


Click it and Unblock the Notifications











