Netflix: నెట్ ఫ్లిక్స్‌లో ఇండియా టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే.. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్‌ను డోంట్ మిస్

ప్రపంచ వ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ ఏదన్నా ఉంది అంటే ఆ సంస్థ నెట్ ఫ్లిక్స్ అనే చెప్పాలి. కాగా ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశంలో కూడా ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ పోలిస్తే ఎక్కువ వినియోగదారులు కూడా ఉన్నారు. కానీ మన దగ్గర ఒకోసారి నెట్ ఫ్లిక్స్ తీసుకునే స్టెప్పులు మాత్రం చాలా కాంట్రవర్సీలకి దారి తీస్తాయి. అలా రీసెంట్ గానే ఓ సినిమా ఇక విషయంలో నెట్ ఫిక్స్ భారీ నెగిటివిటీ ఎదుర్కోవాల్సి వచ్చింది.

మరి ఇన్ని అయినా నెట్ ఫ్లిక్స్ సాలిడ్ కంటెంట్ ని తీసుకొస్తూనే ఉంటుంది. ఇలా ప్రస్తుతం పలు సినిమాలు ఇండియా వైడ్ గా టాప్ 10 లిస్ట్ లో ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ సినిమాల్లో కొన్ని యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. మరి నెట్ ఫ్లిక్స్ లో వరుసగా టాప్ 10 లో ట్రెండ్ అవుతున్న సినిమాలు చూస్తే. 1. బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై, 2. రెబల్ రిడ్జ్, 3. కల్కి 2898 ఎడి, 4. అడియాస్ అమిగో, 5. జియో స్ట్రాం, 6. ది డెలివరన్స్, 7. మహారాజ, 8. ఇండియన్ 2, 9. ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా, 10. బడ్డీ.

netflix top 10 trending movies in india these thrillers you can watch

మరి ఈ 10 సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో ప్రెజెంట్ టాప్ 10 లో ట్రెండ్ అవుతున్నాయి. అయితే సాలు వీటిలో ప్రెజెంట్ చూడదగ్గ సినిమాలు ఏంటో చూద్దాం. మొదటిగా నెంబర్ 1 ప్లేస్ లోనే ట్రెండ్ అవుతున్న బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై అనే ట్రై చేయవచ్చు. హాలీవుడ్ హీరో విల్ స్మిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఈ సినిమా కాగా బ్యాడ్ బాయ్స్ ఫ్రాంచైజ్ లో నాలుగో సినిమాగా ఇది వచ్చింది.

మరి మాంచి యాక్షన్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు అయితే ఈ థ్రిల్లర్ రైడ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ రెండో స్థానంలో ట్రెండ్ అవుతున్న రెబెల్ రిడ్జ్ కూడా ఇటీవలే స్ట్రీమింగ్ కి వచ్చింది. జెరేమి సాల్నియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా అందుబాటులో ఉంది. పైగా తెలుగులో కూడా ఉంది. మరి కొత్త సినిమాని చూడాలి అనుకునేవారు దీనిని కూడా ట్రై చేయవచ్చు.

ఇక మిగతా వాటిలో కల్కి ఆల్రెడీ చూసిందే.. మహారాజ, ఇండియన్ 2 లు కూడా అవసరం లేదు. కానీ మన ఇండియన్ సినిమా నుంచి ఉన్న ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ ని అయితే ట్రై చేయవచ్చు. అదే తాప్సీ, 12త్ ఫెయిల్ నటుడు విక్రాంత్ మెస్సి నటించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' ని ట్రై చేయవచ్చు. ఈ కపుల్ ఇరుక్కున్న ఓ మర్డర్ స్టోరీ లోకి ఓ పోలీస్ వచ్చాక పరిస్థితులు ఎలా మారాయి. అనేది మిగతా సారాంశం.

netflix top 10 trending movies in india these thrillers you can watch

మరి ఈ క్రైమ్ థ్రిల్లర్ తెలుగులో కూడా ఉంది దీనినీ ట్రై చేయండి. ఇక ఫైనల్ గా అల్లు హీరో నటించిన "బడ్డీ" ఉంది. అల్లు శిరీష్ నటించిన ఈ సూపర్ నాచురల్ థ్రిల్లర్ కూడా రీసెంట్ గానే వచ్చింది. పిల్లలతో మంచి కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారు ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయవచ్చు. ఇలా ప్రెజెంట్ టాప్ 10 చిత్రాల్లో చూసేందుకు ఈ సినిమాలు బెటర్ ఆప్షన్ అని చెప్పాలి.

More from Filmibeat

Read more about: will smith bad boys ride or die
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X