నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 ఆల్‌టైమ్ ట్రెండింగ్ మూవీస్.. మీరు చూశారా..?

ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ గురించి తెలియని వారుండరు. తక్కువ ప్రీమియంతో బోల్డెంత వినోదాన్ని అందిస్తున్న ఈ సంస్థ మధ్య తరగతి వర్గాల ఫేవరేట్. ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ మార్కెట్‌లో ఈ సంస్థదే గుత్తాధిపత్యం. కొత్త కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌, ఒరిజినల్ కంటెంట్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడంలో నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడూ ముందే ఉంటుంది. బిజినెస్ స్ట్రాటజీని ఎప్పటికప్పుడు మారుస్తూ ప్రత్యర్ధులకు గట్టి పోటీనిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో వేల సంఖ్యలో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు, షోలు ఉన్నాయి. వీటిలో ది బెస్ట్ ఏంటీ అంటే ఎవరైనా చెప్పడం కష్టమే. కంటెంట్ పరంగా దేని ప్రాధాన్యత దానిదే. అయితే కొన్ని వెబ్‌సైట్స్‌, ఆన్‌లైన్‌లో ఓటీటీ లవర్స్ కోసం ది బెస్ట్ ఏంటీ అంటూ అప్పుడప్పుడు టాప్ 10 మూవీస్, టాప్ 10 వెబ్ సిరీస్‌ల వివరాలను పెడుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటికీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల లిస్ట్ ఇదేనంటూ ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఆ జాబితాను ఓసారి గమనిస్తే.

Netflix s ever top 10 trending movies list Have you watched it here s the details

1. నొక్టర్నల్ యానిమల్స్:

1993లో ఆస్టిన్ రైట్ రచించిన టోనీ అండ్ సుసాన్ నవల ఆధారంగా టామ్ ఫోర్డ్ స్వీయ నిర్మాణంలో ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ను రూపొందించారు. అమీ ఆడమ్స్, జేక్ గిల్లెన్‌‌హాల్ , ఆర్మీ హామర్ కీలకపాత్రలు పోషించారు. 2016 సెప్టెంబర్‌లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

2. సైలెన్స్‌డ్ :

యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్‌కు పెట్టింది పేరైన కొరియన్ ఇండస్ట్రీలో హాంగ్ డాంగ్ హైక్ ఈ సినిమాను తెరకెక్కించారు. గ్వాంగ్‌జు ఇన్హ్వా స్కూల్ ఫర్ ది డెఫ్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను కొరియన్‌లో రూపొందించారు. అధ్యాపకుల చేతుల్లో బధిర విద్యార్ధినులు ఎదుర్కొన్న లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. సౌత్ కొరియాలో ఈ తరహా నేరాలకు కనీస శిక్షను వేయడం సరికాదంటూ ఈ సినిమాలో విమర్శలు గుప్పించారు. 22 సెప్టెంబర్ 2011లో ఈ సినిమా కొరియన్ భాషలో రిలీజైంది.

3. ది సోషల్ నెట్‌వర్క్ :

ఆరోన్ సొర్కిన్ రాసిన ది యాక్సిడెంటల్ బిలియనీర్స్ పుస్తకం ఆధారంగా డేవిడ్ ఫించర్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇందులో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ జీవితాన్ని ప్రస్తావించారు. 2010 సెప్టెంబర్ 24న ఇంగ్లీష్‌లో ఈ మూవీ రిలీజ్ అయ్యింది.

4. ప్రిజనర్స్

డెనిస్ విల్లెనెయువ్ ఈ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. కిడ్నాప్‌కు గురైన ఇద్దరు అమ్మాయిల కేసును ఛేదించే క్రమంలో ఎదురైన ఘటనలను ఇందులో చూపించారు. జేక్ గిల్లెన్‌హాల్, హ్యూ జాక్‌మన్, వియోలా డేవిస్ వంటి స్టార్స్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20, 2013న ఈ మూవీ ఇంగ్లీష్‌లో రిలీజైంది.

5. గెట్ అవుట్ :

జోర్డాన్ పీలే ఈ హార్రర్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఓ నల్లజాతి యువకుడు తన శ్వేతజాతికి స్నేహితురాలి కుటుంబాన్ని కలిసి సంచలన విషయాలను వెలికి తీసాడన్నదే కథ. డేనియల్ కలుయుయా, అల్లిసన్ విలియమ్స్, లిల్ రెల్ హౌరీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. జనవరి 23, 2017న సుడానిస్, ఇంగ్లీష్‌లో ఈ మూవీ రిలీజైంది.

6. ది మెనూ :

కామెడీ హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి మార్క్ మైలాడ్ దర్శకత్వం వహించారు. భోజనప్రియుడైన ఓ వ్యక్తి మారుమూల ప్రాంతంలోని ఓ స్పెషల్ రెస్టారెంట్‌కు వెళ్తాడు. అక్కడి చెఫ్ ఇతని కోసం ఓ ప్రత్యేకమైన వంటకాలను సిద్ధం చేయగా ఈ సమయంలో ఆ వ్యక్తికి ఎదురైన అనుభవాలు ఏంటన్నదే కథ. రాల్ఫ్ ఫియన్నెస్, అన్య టేలర్-జాయ్, నికోలస్ హౌల్ట్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నవంబర్ 18, 2022న ఈ సినిమా ఇంగ్లీష్‌లో రిలీజైంది.

7. ఏ హిడ్డెన్ లైఫ్ :

ఎపిక్ హిస్టారిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు టెరెన్స్ మాలిక్ దర్శకత్వం వహించారు. రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల కోసం పోరాడటానికి నిరాకరించిన ఆస్ట్రియన్ రైతు ఫ్రాంజ్ జాగర్‌స్టాటర్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఆగస్ట్ డీల్, వాలెరీ పాచ్నర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. డిసెంబర్ 13, 2019న ఇంగ్లీష్‌లో ఈ సినిమా రిలీజైంది.

8. ది ఎండ్ ఆఫ్ ది ఎఫైర్ :

రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు నెయిల్ జోర్డాన్‌ దర్శకత్వం వహించారు. 1951లో బ్రిటీష్ రచయిత గ్రాహమ్ గ్రీన్ రాసిన నవల ఆధారంగా దీనిని తెరకెక్కించారు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన సందర్భంలో 1939 నుంచి 1946 వరకు ఓ జంట మధ్య సాగిన వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. రాల్ఫ్ ఫియన్నెస్, జూలియన్నే మూర్‌ తదితరులు కీలకపాత్ర పోషించారు. 11 ఫిబ్రవరి 2000లో ఈ సినిమా ఇంగ్లీష్‌లో రిలీజైంది.

9. బ్రేవ్‌హార్ట్ :

ఎపిక్ హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు మెల్ గిబ్సన్ దర్శకత్వం వహించారు. ఇంగ్లాండ్ రాజు ఎడ్వర్డ్ -1కి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్కాటిష్ స్వాతంత్య్ర పోరాటంలో స్కాట్‌లకు నాయకత్వం వహించిన 13వ శతాబ్ధపు చివరి స్కాటిష్ యోధుడైన సర్ విలియ్ వాలెస్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. సోఫీ మార్సియో, పాట్రిక్ మెక్‌గూహన్‌ తదితరులు కీలకపాత్ర పోషించారు. 1995 మే 24న ఈ సినిమా ఇంగ్లీష్‌లో రిలీజైంది.

10. గోల్ :

స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు డానీ కేనన్ దర్శకత్వం వహించారు. ఫిఫా సహకారంతో తెరకెక్కిన ఈ మూవీలో నిజమైన ఫుట్‌బాల్ టీమ్‌లు, ఆటగాళ్లు నటించారు. శాంటియాగో మునెజ్ (బెకర్) అనే ఆటగాడు ఎదుర్కొన్న సంఘటనలను ఇందులో చూపించారు. మైక్ జెఫరీస్, అడ్రియన్ బుట్చార్ట్‌ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. 1 అక్టోబర్ 2005న ఈ మూవీ ఇంగ్లీష్‌లో రిలీజైంది.

Read more about: netflix ott news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X