Don't Miss!
- News
ఎన్నికల వేళ కొత్త వరాలు - కీలక నిర్ణయాలు: నేడే ప్రభుత్వ ప్రకటన..!?
- Lifestyle
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం ఈ పనులు చేసిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి
- Sports
SA20 : అదరగొట్టిన ఆర్సీబీ కెప్టెన్.. సన్‌రైజర్స్ చిత్తు!
- Finance
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కరువు భత్యాన్ని పెంపు.. ఎంతంటే..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆరియానాకు ఐలవ్యూ చెప్పిన కుర్రాడు.. చివర్లో మాత్రం యమా ట్విస్ట్ ఇచ్చాడుగా!
తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. దేశంలోనే అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది బిగ్ బాస్. ఈ రియాలిటీ షో వల్ల ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులు, యాంకర్లు బడా సెలెబ్రిటీలుగా మారిపోయారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న లేడీగా మారిపోయింది.
దీంతో ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ నాన్ స్టాప్‌తో పాటు ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆరియానాకు ఓ నెటిజన్ షాకిచ్చాడు. అసలేం జరిగిందో మీరే చూడండి!

యూట్యూబ్ యాంకర్ ఇలా ఫేమస్
ఆరియానా గ్లోరీ యూట్యూబ్ యాంకర్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆయనతో ఆమె బోల్డుగా చర్చలు జరపడంతో హైలైట్ అయింది. ఆ తర్వాత ఆర్జీవీ.. ఆరియానాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి ఆమె ఎంతగానో ఫేమస్ అయిపోయింది. దీంతో పాపులార్ అయింది.
శృతి మించిన యాంకర్ స్రవంతి హాట్ షో: బ్లేజర్ విప్పేసి మరీ దారుణంగా!

బిగ్ బాస్ ఛాన్స్... భారీ పాపులారిటీ
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవడంతో ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఆఫర్ అందుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ముక్కుసూటిగా ఉంటూ నిజాయితీ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. అంతేకాదు, ఏకంగా ఫినాలేకు సైతం అడుగు పెట్టి నాలుగో స్థానంలో నిలిచింది.

వరుస ఆఫర్లతో సత్తా చాటిన భామ
బిగ్ బాస్ షో పుణ్యమా అని ఆరియానా ఎంతో ఫేమస్ అయింది. అంతేకాదు, వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలు, ఈవెంట్లు, ప్రారంభోత్సవాలు ఇలా ఫుల్ బిజీ అయిపోయిన ఈ బ్యూటీ.. పలు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇప్పటికే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ సినిమాల్లో నటించింది. అలాగే, మరికొన్ని ప్రాజెక్టులను కూడా అందుకుంటూ సాగుతోంది.
దారుణమైన ఫొటోలు వదిలిన రాశీ ఖన్నా: ఆమెనిలా చూస్తే తట్టుకోలేరు

బిగ్ బాస్ రీఎంట్రీ... పది లక్షలతో
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ 'బిగ్ బాస్ నాన్ స్టాప్'లో బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ కూడా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. గతంలో మాదిరిగా ఈ బ్యూటీ సీరియస్‌గా కనిపించకున్నా.. ఆట పరంగా అందరినీ అలరిస్తూ వచ్చింది. ఫలితంగా మరోసారి ఫినాలేకు చేరుకుంది. అయితే, ఈ సారి మాత్రం బిగ్ బాస్ ఇచ్చిన రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసి తప్పుకుంది.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీ
ఆరియానా పాపులర్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక, షో తర్వాత ఈ బ్యూటీ మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక పోస్టు పెడుతూ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ విపరీతంగా హైలైట్ అవుతోంది.
హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!

ఫాలోవర్లతో ముచ్చట్లు.. ప్రపోజల్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆరియానా గ్లోరీ.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫాలోవర్లతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎంతో చక్కగా సమాధానాలు చెప్పింది. అంతేకాదు, విసిగించే విషయాలను ప్రస్థావించినా ఆమె మాత్రం హుందాగా ప్రవర్తించింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ఆరియానాకు ఐలవ్యూ కూడా చెప్పేశాడు.

ఆరియానాకు షాకిచ్చిన నెటిజన్
ఆరియానా గ్లోరీ నిర్వహించిన చిట్ చాట్‌లో ఓ నెటిజన్ 'ఆరియానా ఐలవ్యూ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం' అని చెప్పాడు. ఇంత వరకూ బాగానే ఉన్నా చివర్లో మాత్రం 'నీ కోతి వాయిస్ చాలా బాగుంటుంది' అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీనికి ఆరియానా నవ్వుతూనే సమాధానం చెప్పింది. అంతేకాదు, సదరు నెటిజన్ ప్రేమకు పొంగిపోతూ ధన్యవాదాలు తెలియజేసింది.