Jawan: ప్రేక్షకులను మోసం చేసిన జవాన్ టీమ్... దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్స్!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. అట్లీ దర్శకత్వం వహించగా.. నయనతార హీరోయిన్ గా నటించింది. ఇక ఇటీవల ఈ సినిమా ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది. అయితే ఓటీటీ రిలీజ్ చూశాక ఆడియెన్స్ మాత్రం ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఇంత మోసం చేస్తారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దక్షణాది సినిమాలతో బాలీవుడ్ డీలా అయిపోయింది. కేజీఎఫ్, బహుబలి,పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు.. బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. దీంతో అప్పుడు పఠాన్ అంటూ షారుఖ్ ఖాన్ వచ్చాడు. బాక్సాఫీస్ మీద దండ యాత్ర చేశాడు. 1000కోట్లరూపాయలకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాడు. రికార్డులు బ్రేక్ చేశాడు. బాలీవుడ్ కు మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చాడు షారుఖ్.

ఇక షారుఖ్ ఖాన్ తాజాగా అట్లీ దర్శకత్వంలో నటించిన చిత్రం జవాన్. ఇక ఈ సినిమాలో నయన్ హీరోయిన్ గా నటించగా... విజయ్ సేతపతి విలన్ గా నటించాడు. సంజయ్ దత్, దీపికా పదుకుణె కీలక పాత్రల్లో నటించారు. ఇక అనిరుథ్ సంగీతం అందించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను గౌరీ ఖాన్ రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1100 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. రికార్డులు బ్రేక్ చేసింది.
అయితే ఇటీవల జవాన్ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ జవాన్ సినిమాను డిజిటల్ ప్రిమియర్ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. షారుఖ్ బర్త్ డే సందర్భంగా నెట్ ఫ్లిక్స్ లో జవాన్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే థియేటర్ వర్షన్ కాకుండా.. ఓటీటీ వర్షన్.. అన్ కట్ వర్షన్ అంటూ ఓటీటీలో రిలీజ్ చేశారు. థియేటర్ లో చూసినా మళ్లీ చూసేలా ఉంటుందని చెప్పి.. నమ్మించారు.

తీరా జవాన్ సినిమా చూసే సరికి అందులో ఎక్స్ట్ సీన్స్ ఏమిలేవని ప్రేక్షకులు అంటున్నారు. కేవల రెండు నిమిషాల సీన్ యాడ్ చేసి... అన్ కట్ వర్షన్ అని చెప్పడం ఏంటని నెటినజ్స్ ఫైర్ అవుతున్నారు. ఇది చాలా మోసం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ రెండు నిమిషాల సీన్ పెట్టకపోయినా ఎవరు పెద్దగా గుర్తించరు.. దానికి ఎక్స్ టెండ్ వర్షన్ అని ఎందుకు పేరు అంటూ నెట్ ఫ్లిక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త వర్షన్ విడుదల పేరుతో ఆడియెన్స్ సినిమా మళ్లీ చూసేలా చేసేందుకు ఈ ట్రిక్ యూజ్ చేశారని తెలుస్తోంది. దీని వల్ల థియేటర్లో చూసినా ... మళ్లీ చూస్తారు అనేది వాళ్ల ప్లాన్. దీనిపై ప్రేక్షకులు మాత్రం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఒక్క నెట్ ఫ్లిక్స్ అని కాదు.. చాలా ఓటీటీ సంస్థలు ఇప్పుడు ఇలాగే చేస్తున్నాయి... ప్రేక్షకులను మళ్లీ మళ్లీ చూసేలా చేసేందుకు ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











