Khatron Ke Khiladi 13 finale విజేత ఎవరో తెలుసా? డైరెక్టర్ రోహిత్ శెట్టి ఎమోషనల్ పోస్ట్ వైరల్
బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి హోస్ట్‌గా కొనసాగుతున్న ఖత్రోంకే కిలాడీ 13వ సీజన్ ముగింపు దశకు చేరుకొన్నది. అత్యంత క్రేజ్ ఉన్న ఈ రియాలిటీ షోకు సంబంధించిన ఫినాలే షూట్‌ను రోహిత్ శెట్టి పూర్తి చేయడంతో దాదాపు ఈ కార్యక్రమం దాదాపు ముగిసినట్టు అయింది. గత కొద్ది వారాలుగా ఎంతో ఉత్కంఠ, ఎమోషన్స్, టెన్షన్‌తో సాగిన ఈ రియాలిటీ షో ముగుస్తుండటంతో రోహిత్ శెట్టి ఎమోషనల్ అయ్యాడు. తన ఇన్సాటాగ్రామ్‌లో భావోద్వేగంతో పెట్టిన పోస్టు వివరాల్లోకి వెళితే..
ఖత్రోంకే కిలాడీ 13వ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళితే.. రుహి చతుర్వేది, అర్చన గౌతమ్, నైరా బెనర్జీ, రష్మీత్ కౌర్, శివ్ థాకరే, మౌఫకీర్, షెహనాజ్ ఖాన్, హీరోయిన్ డైసీ షా, అంజుమ్ ఫకీ, అంజలీ ఆనంద్, నటుడు రోహిత్ రాయ్, ఐశ్వర్య శర్మ భట్ తదితరులు ఈ షోలో పాల్గొన్నారు. ఈ షోలో ఫైనలిస్టులుగా ఐశ్వర్య శర్మ భట్; అర్జిత్ తనేజా, డినో జేమ్స్ నిలిచారు.

ఖత్రోంకే కిలాడీ 13వ సీజన్ ఉత్కంఠతో సాగిన ఈ షోకు అద్బుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు దర్శకుడు, హోస్ట్ రోహిత్ శెట్టి ధన్యవాదాలు తెలిపారు. ఆడియెన్స్ అద్బుతంగా సపోర్ట్ ఇవ్వకుంటే 13 సీజన్లు కొనసాగేది కాదు. నా షోకు అండగా నిలిచిన ప్రతీ ఫ్రేక్షకుడికి రుణపడి ఉంటాను. ఇక ముందు కూడా ఇదే విధంగా ప్రేమను కురిపించాలని రొహిత్ శెట్టి అన్నారు.
ఖత్రోంకే కిలాడీ 13వ సీజన్‌ను సంబంధించిన ఫైనల్ ఎపిసోడ్ షూట్‌ను ఫూర్తి చేశాను. ఈ షోను నంబర్ 1 స్థానంలో నిలిపినందుకు ఆడియెన్స్‌కు నా థ్యాంక్స్. ప్రతీ వారం రెట్టించిన ఉత్సాహంతో నా షోను టాప్ షోగా మార్చారు అంటూ రోహిత్ శెట్టి తెలిపారు. త్వరలోనే మంచి కంటెస్టెంట్లతో మరో సీజన్‌తో రావడానికి ప్రయత్నిస్తానని అన్నారు.

ఖత్రోంకే కిలాడీ 13వ సీజన్ ఫినాలే షూట్ అయిందనే వార్తతో ఆడియెన్స్, నెటిజన్లలో ఉత్సాహం పెరిగిపోయింది. ఐశ్వర్య శర్మ భట్; అర్జిత్ తనేజా, డినో జేమ్స్ ఎవరు గెలుస్తారనే విషయంపై లెక్కలు వేస్తున్నారు. అయితే మెజారిటీ నెటిజన్లు, ఆడియెన్స్ మాత్రం డినో జేమ్స్ విజేతగా నిలువడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.రన్నరప్‌గా ఐశ్వర్య, అర్జిత్ నిలుస్తారని పేర్కొంటున్నారు.
ఖత్రోంకే కిలాడీ రియాలిటీ షోలో ప్రతీసారి 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమవుతుంది. దాదాపు ఈ షో 50 రోజులపాటు కొనసాగుతుంది. యాక్షన్, థ్రిల్లింగ్, కారు స్టంట్స్‌తో ఉత్కంఠగా ఈ షో సాగుతుంది. గత 13 సీజన్లుగా రోహిత్ శెట్టి ఈ షోను అద్బుతంగా డిజైన్ చేస్తుండటం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications











