OTTలోకి మరో అడ్వెంచరస్ క్రైమ్ కామెడీ మూవీ.. అదేంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందంటే?
రోజురోజుకూ థ్రిల్లర్, హార్రర్, క్రైమ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి జోనర్ లోనే సినిమాలు, వెబ్ సిరీస్ లు ఎక్కువగా వస్తున్నాయి. జనాలు అంతా కూడా వీటినే ఎక్కువగా ఇష్ట పడుతుండగా.. దర్శక, నిర్మాతలు కూడా ఇలాంటి వాటిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఇలాంటి చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో చాలా రాగా.. ఇప్పుడు మరో అడ్వెంచరస్ క్రైమ్ కామెడీ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ సినిమా ఏంటి, ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
భరత్ తిప్పిరెడ్డి, కేవశ కర్రి, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో రాబోతున్న సరికొత్త అడ్వెంచరస్ క్రైమ్ కామెడీ సినిమానే శర్మ & అంబానీ. కార్తీక్ సాయి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రంలో.. మానస్ అద్వైత్, రాజశేఖర్ నర్జాలా, విశ్వనాథ్ మాండళిక, యష్. రూపక్, అభిషేక్, హనుమంత్ రావు, అవినాష్ దేవిరెడ్డి, స్మిత రామన్న, అవ్యుక్త్ తిప్పిరెడ్డి వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఇలాంటి సరికొత్త కథను ఈ వెబ్ సిరీస్ కోసం అందించింది పార్వతీశం గురు, కార్తీక్ సాయి, భరత్ తిప్పిరెడ్డిలు.

అదిరిపోయే కథాంశంతో రాబోతున్న ఈ అడ్వెంచరస్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు శశాంక్ ఆలమూరు, మహా సంగీతం అందిస్తుండగా... ఏకే స్వామి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అలాగే గౌతమ్ రాజు నెరుసు ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఈరోజు శర్మ & అంబానీ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఇందులో ఆయుర్వేదిక్ డాక్టర్ శర్మగా భరత్ తిప్పిరెడ్డి కనిపించగా.. అంబానీ పాత్రలో కేశవ్ కర్రి కనిపించాడు. రోజంతా షూ పాలిష్ చేస్తూ... రాత్రి రోడ్డుపై పడుకునే ఇతడికి ఓ కళ ఉంటుంది. ముఖ్యంగా ఓ పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ లో బ్రాండెడ్ బట్టలు వేసుకుని.. రాత్రంతా పడుకోవాలని అనుకుంటాడు.
మరోవైపు ధన్య బాలకృష్ణ సితార పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే అనుకోకుండా ఒక రోజు శర్మ డేంజరస్ గ్యాంగ్ తో గొడవ పడతాడు. ముఖ్యంగా పోయిన వజ్రాలను దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఇలా ఆద్యంతం ఆకట్టుకునే కథాంశంతో రాబోతున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ వేదికగా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్స్ వేదికగా ఈ సంస్థ.. ఏప్రిల్ 11వ తేదీ నుంచి శర్మ & అంబానీ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించింది.
తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ అదిరిపోగా.. ఏం జరుగుతుందోనని ఆసక్తి రేకెత్తుతోంది. అసలు ఈ కథలో పూర్తిగా ఎం జరిగిందో తెలియాలంటే మాత్రం కచ్చితంగా ఈ సినిమాను చూడాల్సిందే. మరో ఐదు రోజుల్లో అంట్ ఏప్రిల్ 11వ తేదీన రాబోతున్న ఈ చిత్రం కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూసేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేయండి.


Click it and Unblock the Notifications











