OTTలోకి సూపర్ హార్రర్ క్రైమ్ డ్రామా సిరీస్.. డేర్ ఉంటే డోంట్ మిస్.. ఎక్కడ చూడాలంటే?
ఈ మధ్య కాలంలో ఓటీటీలో వెబ్ సిరీస్ ల సందడి బాగా పెరిగిపోయింది. చిన్న చిన్న ఆర్టిస్ట్ ల నుంచి పెద్ద పెద్ద హీరోల వరకు అంతా ఓటీటీ వైపే నడుస్తున్నారు. సినిమాలు చేస్తున్నట్లుగానే వెబ్ సిరీస్ లలో కూడా కనిపిస్తూ అలరిస్తున్నారు. ముఖ్యంగా వీటిల్లో హార్రర్, థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు ఎక్కువగా ఉంటున్నాయి. కేవలం సిరీస్ లు మాత్రమే కాకుండా అలాంటి సినిమాలే ఈ మధ్య ఎక్కువగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
అభిమానుల అభిరుచులకు తగ్గట్లుగా దర్శక, నిర్మాతలు కూడా అలాంటి సినిమాలు వెబ్ సిరీస్ లతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా అదరిపోయే హార్రర్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు తీసుకు వస్తూ సినీ ప్రియులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. అయితే తాజాగా మరో సూపర్ హార్రర్ క్రైమ్ డ్రామా సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది. అయితే ఆ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అందాల రాక్షసి సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర.. తాజాగా ఓ సూపర్ వెబ్ సిరీస్ చేశారు. ముఖ్యంగా హార్రర్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరే... "ఇన్‌స్పెక్టర్ రిషి". అయితే నవీన్ చంద్ర.. ఈ వెబ్ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో అంటే ఇన్‌స్పెక్టర్ రిషిగా కనిపించబోతున్నాడు.
నవీన్ చంద్రతో పాటు సునైనా, కన్నా రవి, మాలిని జీవరత్నం, శ్రీకృష్ణ దయాళ్, కుమారవేల్ వంటి వాళ్లు కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. అదిరిపోయే కథాంశంతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో మర్డర్ మిస్టరీని ఛేదించే పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయినట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అయితే సూపర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అనుక్షణం భయపెట్టబోతున్నట్లు సమాచారం.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా ఈ వెబ్ సిరీస్ ను మార్చి 29వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ప్రకటించింది. ఎక్స్ వేధికగా ఈ విషయాన్ని తెలిపింది. ముఖ్యంగా తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
హార్రర్, థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్ లను ఇష్టపడే వారంతా ఈ వెబ్ సిరీస్ ను ఇంట్లోనే కూర్చొని చూస్తూ.. ఫ్యామిలీతో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అనుక్షణం నరాలు తెంచే ఉత్కంఠను కల్గించే నవీన్ చంద్ర వెబ్ సిరీస్ ను అస్సలే మిస్ కాకండి.


Click it and Unblock the Notifications











