ఈ వారం ఓటిటిలోకి మోస్ట్ అవైటింగ్ మూవీలు..ఈ 3 మాత్రం డోంట్ మిస్..!

వీకెండ్ దగ్గర పడుతోంది. ఎప్పటిలాగే ఈ ఫ్రైడే కూడా పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. అయితే ఈ వారం ఎక్కువగా తెలుగు సినిమాలు, మోస్ట్ అవైటింగ్ మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీగా ఉండడం విశేషం. మరి ఈసారి మిస్ కాకుండా చూడాల్సిన ఆ సినిమాలు ఏంటో, అవి ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫ్రైడే అంటే ఏప్రిల్ 12న ఏకంగా 11 సినిమాలు ఓటీటీలో అందుబాటులోకి రాబోతున్నాయి. అందులో మాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేమలు, విశ్వక్ సేన్ గామి, ఓం భీమ్ బుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలామ్ వంటి మిస్ కాకుండా చూడాల్సిన ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. మరికొన్ని ఇంగ్లీష్ తో పాటు ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఈవారం ఓటీటీలోకి రాబోతున్నాయి.

New Telugu Movies to streaming on OTT s from April 12 gaami premalu Om Bheem Bush lal salam

1. ప్రేమలు
మలయాళ భాషలో ఘన విజయం సాధించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమలు. కేరళలో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. రాజమౌళి తనయుడు కార్తికేయ ప్రేమలు మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో టాలీవుడ్ లో హిట్ అందుకున్నాడు. కమర్షియల్ గా ఈ మూవీ అంతగా లాభాలు తెచ్చి పెట్టకపోయినా హిట్ టాక్ అయితే అందుకుంది. ఇక ఈ బ్లాక్ బస్టర్ మూవీ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12 నుంచి ఆహాలో ప్రసారం కాబోతోంది. మిగతా భాషల్లో మాత్రం మరో ఓటిటి ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏప్రిల్ 12నే అందుబాటులో ఉంటుంది.

New Telugu Movies to streaming on OTT s from April 12 gaami premalu Om Bheem Bush lal salam

2. గామి
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ప్రయోగాత్మక చిత్రం గామి. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ విశ్వక్ ఖాతాలో మరో హిట్ గా నిలిచింది. ఇక చాలా రోజుల నుంచి గామి మూవీ ఓటిటి స్ట్రీమింగ్ కోసం విశ్వక్ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 12న ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది.

New Telugu Movies to streaming on OTT s from April 12 gaami premalu Om Bheem Bush lal salam

3. ఓం భీమ్ బుష్
శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ అండ్ హారర్ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఏప్రిల్ 12 నుంచి ఓం భీమ్ బుష్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోతోంది. మరి ఈ మూవీని ఇంట్లోనే చూసి కడుపుబ్బా నవ్వుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా?

New Telugu Movies to streaming on OTT s from April 12 gaami premalu Om Bheem Bush lal salam

4. లాల్ సలామ్
సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో కనిపించిన రీసెంట్ మూవీ లాల్ సలామ్. ఈ మూవీకి ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించింది. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే థియేటర్లలో ఈ మూవీని చూడడానికి ఇష్టపడని రజినీ ఫ్యాన్స్ ఓటిటిలో మాత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. లాల్ సలామ్ ఏప్రిల్ 12 నుంచి సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X