బాలకృష్ణపై మనసు పారేసుకున్న హీరోయిన్.. ఆమె చేసిన పనికి హీరో అసహనం!

నందమూరి నటిసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ప్రజల్లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాలయ్య బాబు సినిమాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు అభిమానులు. అలాంటి ఆయన ఇటీవల వరుసగా హిట్స్ ఇస్తూ సత్తా చాటుతున్నారు.

అంతేకాకుండా టాక్ షోకు హోస్ట్ గా మారి తన మార్క్ తో రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలనుకునే హీరోయిన్లు ఎందరో. అయితే తాజాగా ఈ నటసింహంపై ఓ బ్యూటిఫుల్ అండ్ యంగ్ హీరోయిన్ మనసు పారేసుకుంది. అది చూసిన మరో హీరో కాస్తా అసహనం వ్యక్తం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ట్రెండ్ కి తగినట్లుగా..

ట్రెండ్ కి తగినట్లుగా..

ఇటీవల వీర సింహా రెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నందమూరి నటసింహం బాలయ్య బాబు వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు. కామెడీ చిత్రాలకు పేరొందిన అనిల్ రావిపూడితో ఒక సినిమాను బాలకృష్ణ లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. అలాగే తనకు బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఇలా వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోయే బాలకృష్ణ ట్రెండ్ కి తగినట్లుగా నడుచుకుంటారు.

క్రికెట్ కామెంటేటర్ గా..

క్రికెట్ కామెంటేటర్ గా..

ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా ప్రసారం అయిన అన్ స్టాపబుల్ టాక్ షోకి హోస్ట్ గా మారి సెన్సెషన్ క్రియేట్ చేశాడు నందమూరి నటసింహం. తెలుగు టాక్ షోలలో అన్నిటింకంటే క్రేజ్ వచ్చేలా హోస్ట్ గా తన మార్క్ చూపించాడు. ఇలా హోస్ట్ గా, అలాగే పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ కమర్షియల్ యాడ్స్ తోనూ దుమ్ము లేపాడు. అంతకుమించి అన్నట్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో క్రికెట్ కామెంటేటర్ గా కూడా మారనున్నాడు.

స్టైలిష్ లుక్ లో..

స్టైలిష్ లుక్ లో..

ఎన్నో వైవిధ్యమైన షోలను అందిస్తున్న ఆహా దేశంలోని అనేకమంది ప్రతిభావంతులైన గాయకులను ఇండియన్ ఐడల్ ద్వారా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా ఈ షో మొదటి సీజన్ పూర్తి కాగా ఇటీవలే రెండో సీజన్ ను మొదలు పెట్టారు. అందులో ఒక ఎపిసోడ్ ను గాలా విత్ బాలా పేరుతో ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ అదిరిపోయే ఉబేర్ స్టైలిష్ అవతారంలో కనిపించిన ఫొటోలు, వీడియో వైరల్ గా మారాయి.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా..

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా..

ఈ ఇండియన్ ఐడల్ రెండో సీజన్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్స్ గీతా మాధురి, కార్తీక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించగా బాలకృష్ణ ఈ వారం అతిథిగా హాజరయ్యాడు. అయితే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఆహా నిర్మించిన "న్యూసెన్స్" వెబ్ సిరీస్ టీమ్ సందడి చేసింది. అందులో భాగంగా హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవిని స్టేజీపైకి ఆహ్వానించాడు హోస్ట్, సింగర్ హేమచంద్ర. ఇండియన్ ఐడల్ చరిత్రలోనే మొదటిసారిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉందని వారిద్దరిని పిలిచాడు హేమచంద్ర.

రావయ్య ముద్దులు మావా..

రావయ్య ముద్దులు మావా..

హేమచంద్ర పిలవడంతో నవదీప్, బిందు మాధవి స్టేజీపైకి వచ్చారు. వాళ్లిద్దరి చూసి షాక్ అయిన బాలకృష్ణ.. నిజమా.. నవదీప్, బిందుమాధవి వచ్చారేంటీ అన్నట్లుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. తర్వాత హీరో నవదీప్ పాట పాడేందుకు ప్రయత్నించాడు. "గసగస.. గుసగుస" అంటూ కామెడీ చేశాడు హీరో నవదీప్. తర్వాత "పాట అంటే ఇలానా పాడేది.. నేను పాడతాను" అని మైక్ తీసుకుంది బిందు మాధవి. "రావయ్య ముద్దుల మావా.. నీకు రాసిస్తా రాయలసీమ" అని బిందు మాధవి పాడింది.

అన్ని మార్చావ్.. ఏందీ కథ..

బిందు మాధవి అలా పాడేసరికి కుర్చీలో నుంచిలేచి ఒకలాంటి ఎక్స్ ప్రెషన్ ఇచ్చి మళ్లీ కూర్చున్నాడు బాలకృష్ణ. అలా బాలయ్య బాబుపై బిందు మాధవి మనసు పారేసుకునే సరికి.. "ఏందమ్మీ మదనపల్లిలో నేను పాడిందే పాట, ఆడిందే ఆట అంటివి.. ఈడికొచ్చి బాలయ్య బాబు గారిని చూడంగనే.. రూట్ మార్చావ్.. పాట మార్చావ్.. శ్రుతి మార్చావ్.. ఏందీ కథ" అని నవదీప్ ఫన్నీగా అసహనం వ్యక్తం చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X