నిహారిక నుంచి ఊహించని ప్రకటన: విడాకుల వార్తల నేపథ్యంలో కొత్త నిర్ణయం.. F**K అంటూ!

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్లు తమ పిల్లలను యాక్టర్లుగా పరిచయం చేశారు. అందులో కొందరు మాత్రమే అమ్మాయిలను కూడా సినీ రంగానికి తీసుకు వచ్చారు. అలా వచ్చిన వారిలో మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల ఒకరు. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. నటిగా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ, నిర్మాతగా మాత్రం సత్తా చాటుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండు రోజులుగా నిహారిక విడాకులకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఊహించని ప్రకటన చేసింది. ఆ వివరాలు మీకోసం!

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

అలా పరిచయం.. ఫుల్ ఫేమస్

నిహారిక ముందుగా 'ఢీ' అనే డ్యాన్స్ షోలో యాంకర్‌గా చేసింది. అందులో మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లనూ నటించింది. ఈ క్రమంలోనే 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మంచి పేరు తెచ్చుకుని ఫుల్ ఫేమస్ అయింది.

హీరోయిన్‌గా మాత్రం నిరాశగా

హీరోయిన్‌గా మాత్రం నిరాశగా

సినీ రంగంలోకి రాకముందే తన టాలెంట్లతో మెప్పించిన నిహారిక.. నాగశౌర్య నటించిన 'ఒక మనసు' అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయం అయింది. అయితే, ఈ సినిమా అంతగా ఆడకపోవడంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కలేదు. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' వంటి చిత్రాలు చేసింది. కానీ, ఇవేమీ నిహారికకు ఒక్క విజయాన్ని కూడా అందించలేదు.

అతడితో పెళ్లి.. కెరీర్ మాత్రం

అతడితో పెళ్లి.. కెరీర్ మాత్రం

నిహారిక 2020లో చైతన్య జొన్నలగడ్డ అనే కుర్రాడిని వివాహం చేసుకుంది. అయితే, పెళ్లి తర్వాత కూడా ఈ అమ్మడు తన కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఈ మధ్య కాలంలో మెగా డాటర్ హీరోయిన్‌గా నటించకున్నా.. నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన బ్యానర్‌పై 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'హలో వరల్డ్' వెబ్ సిరీస్‌లు నిర్మించి సత్తా చాటింది.

విడాకుల వార్తలతో హైలైట్‌గా

విడాకుల వార్తలతో హైలైట్‌గా

చైతన్య జొన్నలగడ్డతో వివాహం తర్వాత నిహారిక కొణిదెల కెరీర్ పరంగా బిజీగా ఉన్నప్పటికీ.. తన వైవాహిక జీవితాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె భర్తకు విడాకులు ఇవ్వబోతుందని రెండు మూడు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో కావడమేనన్న సంగతి తెలిసిందే.

రెస్పాన్స్ లేదు.. నిజమే అని

రెస్పాన్స్ లేదు.. నిజమే అని


నిహారిక కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెళ్లి సమయంలో తీసుకున్న ఫొటోలన్నీ డిలీట్ చేసేశాడు. దీంతో వీళ్ల విడాకుల వార్తలకు బలం చేకూరినట్లైంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈ జంట కానీ, వీళ్ల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లు కానీ దీనిపై స్పందించలేదు. దీంతో నిహారిక నిజంగానే భర్తతో విడాకులు తీసుకుంటుందని అంతా అనుకుంటున్నారు.

కొత్త ఏడాది.. కొత్త ప్రకటనతో

కొత్త ఏడాది.. కొత్త ప్రకటనతో


ఒకవైపు విడాకులకు సంబంధించిన వార్తలు జోరుగా ప్రచారం అవుతోండగానే.. మరోవైపు నిహారిక కొణిదెల ఉగాది పండుగ రోజున ఓ ప్రకటన చేసింది. అదేమిటంటే.. ఈ మెగా డాటర్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్న 'డెడ్ పిక్సెల్' అనే వెబ్ సిరీస్‌లో భాగం అవడమే. దీన్ని నిహారిక స్వయంగా నిర్మించడంతో పాటు ఇందులో ఓ ప్రధాన పాత్రను కూడా పోషిస్తుందని టాక్.

ఆ వీడియోలో.. ఫ* అంటూ

'డెడ్ పిక్సెల్' వెబ్ సిరీస్‌కు సంబంధించిన వీడియోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన నిహారిక 'కొత్త సంవత్సరం.. కొత్త అనౌన్స్‌మెంట్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో డెడ్ పిక్సెల్ చేస్తున్నాం. అతి త్వరలోనే ఇది రాబోతుంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక, ఆ వీడియోలో నిహారిక 'వాట్ ద ఫక్' అంటూ ఓ డైలాగ్ కూడా వదిలింది. దీంతో ఇది బాగా వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X