ఓటీటీలోకి జాతర లాంటి హిట్ సినిమా.. అస్సలు మిస్ కాకూడని దీన్ని ఎలా చూడాలంటే!
తెలుగు సినిమా రంగంలో మనసుకు హత్తుకునే కాన్సెప్టులతో ఎన్నో సినిమాలు రూపొందుతోన్నాయి. అందులో కొన్ని మాత్రం పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌తో వచ్చి ప్రేక్షకులను ఫిదా చేసేస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఇలాంటివి చాలా చిత్రాలు అలరించాయి. అలా ఇటీవలే థియేటర్లలో సందడి చేసిన సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు' (Committee Kurrollu).
మెగా డాటర్ నిహారిక కొణిదెల.. పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలను సినీ రంగానికి పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రం మంచి బిజినెస్‌తో ఆగస్టు 9వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది.

మనసుకు హత్తుకునే కథాంశంతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన కూడా వచ్చింది. దీంతో ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను అందుకుంటూ సత్తా చాటింది. ఫలితంగా వేగంగానే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సైతం చేరుకుని.. భారీ స్థాయిలో లాభాలను ఖాతాలో వేసుకుంది.
నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన 'కమిటీ కుర్రోళ్ళు' మూవీ ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ కూడా లభించింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ ఇటీవలే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది.
పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించే కథతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాను సెప్టెంబర్ 12వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఈటీవీ విన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అందుకు తగ్గట్లుగానే 'బ్లాక్‌బస్టర్ జాతర చూడడానికి సిద్దంగా ఉండండి' అంటూ ఓ పోస్టర్ వదిలింది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. గుండెల్ని పిండేసే స్టోరీలైన్‌తో తెరకెక్కిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందింది. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పిక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











