ఓటీటీలోకి నిహారిక ఫస్ట్ హిట్ మూవీ.. ఏడిపించే దీన్ని ఎక్కడ చూడాలంటే!

మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అదే సమయంలో ఒకే ఒక్క లేడీ కూడా హీరోయిన్‌గా వచ్చింది. ఆమెనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల. మొదట్లో హీరోయిన్‌గా పరిచయం అయిన ఈ భామ.. సక్సెస్ కాలేక ఇబ్బంది పడింది. ఈ పరిస్థితుల్లో నిర్మాతగానైనా సత్తా చాటాలని నిహారిక చేసిన సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'.

పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలను సినీ రంగానికి పరిచయం చేస్తూ మెగా డాటర్ నిహారిక కొణిదెల తీసిన సినిమానే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో అంచనాలను పెంచుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రం మంచి బిజినెస్‌తో ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

Niharika Konidela Committee Kurrollu Movie Digital Streaming On ETV Win

గుండెల్ని పిండేసే కథతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన కూడా దక్కింది. దీంతో ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సైతం చేరుకుని.. భారీ స్థాయిలో లాభాలను అందుకుంది.

నిహారిక కొణిదెల ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' మూవీ ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఈటీవీ విన్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ ఇటీవలే సోషల్ మీడియా ద్వారా అనధికారికంగా ప్రకటించింది.

Niharika Konidela Committee Kurrollu Movie Digital Streaming On ETV Win

బాల్యాన్ని గుర్తు చేసే కథాంశంతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా హిట్ అవడంతో ఇది ఆలస్యంగానే ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ మొదటి వారంలోనే తీసుకు రాబోతున్నారట. అందుకు తగ్గట్లుగానే ఈటీవీ విన్ సంస్థ తాజాగా ఇది త్వరలోనే రాబోతుందని ఓ పోస్టర్ వదిలింది. దీంతో ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. క్రేజీ కాన్సెప్టుతో 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందింది. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పిక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X