ఆ ఓటీటీలోనే నిహారిక సూపర్ హిట్ మూవీ.. గుండెలు పిండేసే దీన్ని ఎలా చూడాలంటే!

మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే ఎన్నో రకాల కాన్సెప్టులతో సినిమాలు వస్తున్నాయి. అందులోనూ పల్లెటూరి నేపథ్యంతో గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. అలాంటి వాటికే ఆడియెన్స్ జై కొడుతున్నారు. దీంతో అదే తరహాలో ప్యూర్ స్టోరీలతో మూవీలు వస్తున్నాయి. అలా ఇటీవలే వచ్చిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'.

పదకొండు మంది కుర్రాళ్లు, నలుగురు అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన చిత్రమే 'కమిటీ కుర్రోళ్ళు'. యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రం మంచి బిజినెస్‌తో ఆగస్టు 9వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది.

Niharika Konidela Committee Kurrollu Movie OTT Details Revealed

పక్కా పల్లెటూరి స్టోరీతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన కూడా దక్కుతోంది. దీంతో ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇలా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను సైతం చేరుకుని.. ఈ సినిమా లాభాలను ఖాతాలో వేసుకుంటోంది.

ప్రతి ఒక్కరి బాల్యాన్ని గుర్తు చేసే కథతో వచ్చిన 'కమిటీ కుర్రోళ్ళు' మూవీ ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఆహా సంస్థ సొంతం చేసుకుంది. ఇందుకోసం సదరు సంస్థ నిర్మాతలకు మంచి మొత్తాన్నే ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా హిట్ అవడంతో ఇది ఆలస్యంగానే ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని నాలుగు వారాల తర్వాతనే స్ట్రీమింగ్‌కు తీసుకు రాబోతున్నారు. అంటే ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ రెండో వారంలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తాజాగా తెలిసింది.

Niharika Konidela Committee Kurrollu Movie OTT Details Revealed

ఇదిలా ఉండగా.. ఫీల్ గుడ్ స్టోరీతో రూపొందిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా పల్లెటూరి బ్యాగ్‌డ్రాప్‌లో రూపొందింది. యదు వంశీ తెరకెక్కించిన దీన్ని పిక్ ఎలిఫెంట్స్ బ్యానర్‌పై జయలక్ష్మి అడపాక, నిహారిక కొణిదెల నిర్మించారు. ఇందులో సాయి కుమార్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి అనుదీప్ దేవ్ మ్యూజిక్‌ను ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X