Niharika Konidela బీబీసీ వెబ్ సిరీస్‌లో నిహారిక కొణిదెల.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఏ ఓటీటీలో?

మెగా డాటర్ నిహారిక కొణిదెల మరోసారి విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకొన్న నిహారిక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యూత్‌ను ఆకట్టుకొనే విధంగా వినోదానికి పెద్ద పీట వేసే విధంగా వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. డెడ్లీ పిక్సెల్స్ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఖరారు చేశారు. అయితే ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బీబీసీ, తమడా మీడియా కాంబినేషన్‌లో: బీబీసీ స్టూడియోస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తమడా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న డెడ్లీ పిక్సెల్స్ ప్రముఖ ఓటీటీ ఛానెల్ డిస్నీ + హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను మే 19 నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు డిస్నీ+హాట్ స్టార్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలియజేశారు.

Niharika Konidelas Dead Pixels to stream on Disney plus Hotstar: Release date is here

నేటితరం జనరేషన్‌ను టార్గెట్‌గా: నిహారిక కొణిదెల కీలక పాత్రలో నటిస్తున్న డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా.. మంచి రెస్సాన్స్ వచ్చింది. ప్రస్తుతం తరం ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందనే విషయం టీజర్ ద్వారా స్పష్టం చేశారు.

Niharika Konidelas Dead Pixels to stream on Disney plus Hotstar: Release date is here

గేమర్‌గా నిహారిక కొణిదెల: నిహారిక కొణిదెల డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్‌లో గేమర్‌గా సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. కొత్త వీడియో గేమ్‌ను రూపొందించే నలుగురు సభ్యుల టీమ్ మధ్య కథ సాగుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో నిహారిక, వైవా హర్ష, అక్షయ్, సాయి రోనక్, భావన, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ ప్రోమో కంటెంట్ మంచి అంచనాలను పెంచుతున్నది.

Niharika Konidelas Dead Pixels to stream on Disney plus Hotstar: Release date is here

నటీనటులు, సాంకేతిక నిపుణులు: నటీనటులు: నిహారిక కొణిదెల, వైవా హర్ష, అక్షయ్, సాయి రోనక్, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ తదితరులు
డైరెక్టర్: ఆదిత్య మండల
ప్రొడ్యూసర్స్: సమీర్ గోగతే, సాయిదీప్ రెడ్డి బొర్రా, రాహుల్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: దీపాలు హండా, శ్రీహర్ష బసవ
లైన్ ప్రొడ్యూసర్స్: అనిల్ కుమార్ తీర్రే, సాయి వర్మ వేగిరాజు
ప్రొడక్షన్ హౌస్: బీబీసీ స్టూడియోస్ ఇండియా , తమడా మీడియా
ప్రొడక్షన్ డిజైనర్: శివమ్ రావు
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
మ్యూజిక్ డైరెక్టర్: సిదార్థ సదాశివుని
డివోపి: ఫహద్ అబ్దుల్ మజీద్
రచన: అక్షయ్ పుల్ల
హెడ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్: బీబీసీ స్టూడియోస్, సిద్ధార్థ్ హిర్వే
పీఆర్వో: జీఎస్కే మీడియా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X