Madraskaaran OTT: ఓటీటీలోకి మెగా డాటర్ కొత్త సినిమా.. రొమాంటిక్ యాక్షన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Madraskaaran OTT: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఒకప్పుడు యాంకర్‌గా అడుగుపెట్టింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. మెగా డాటర్ నిహారిక యాంకర్‌గా, హీరోయిన్ గా, నిర్మాతగా మంచి పేరు దక్కించుకుంది. కథానాయికగా ఎక్కువ సినిమాల్లో నటించినప్పటికీ ప్రేక్షకుల మెప్పు పొందింది. తాజాగా ఈ అమ్మడు ప్రధాన పాత్రలో నటించిన ఓ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ ? ఆ రొమాంటిక్ సినిమా ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నదంటే?
మెగా డాటర్ నిహారిక నటిగా కెరీర్‌ని కొనసాగించే ముందు బుల్లితెర ప్రముఖ షో అయిన ఢీ జూనియర్ 1 అండ్ ఢీ జూనియర్ 2 విభాగాలకు ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షోను హోస్ట్ చేసింది. ఒక మనసు అనే సినిమాలో నాగశౌర్య సరసన నటించింది నిహారిక. ఈ సినిమాలో నిహారిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఓరు నల్ల నాల్ పాతు సోల్రెన్, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహా రెడ్డి, డార్లింగ్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా, అతిథి పాత్రలో, హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటిస్తూ మంచి పాపులర్టీ తెచ్చుకుంటుంది ఈ అమ్మడు.

అలాగే ఇటీవల నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం అయి 'కమిటీ కుర్రోళ్లు'(Committee Kurrollu) సినిమాతో ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సక్సెస్ తో మరిన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. అలాగే సమయం దొరికినప్పుడల్లా తన లోని నటనకు మెరుగులు పెడుతుంది. అలా.. నిహారిక నటించిన లేటెస్ట్ మూవీ 'మద్రాస్‌కారన్'. ఈ మూవీలో షేన్ నిగమ్ హీరోగా నటించగా.. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఎస్‌ఆర్ ప్రొడక్షన్ బ్యానర్‌పై బి. జగదీష్ (Jagadish)నిర్మించగా.. సామ్ సీఎస్(Sam CS) సంగీతం అందించారు.
తమిళ మూవీ 'మద్రాస్‌కారన్' సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్‌లో విడుదలైంది. అయితే ఈ సినిమా మిక్స్ డ్ టాక్ అందుకోవడంతో అనుకున్న విధంగా సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ, నిహారిక నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.థియేటర్లలో విడుదలైన నెలరోజుల్లోపే ఈ మూవీ ఓటీటీకి వస్తుండటం ఆసక్తి రేపుతోంది. తాజాగా మూవీమేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు.
రొమాంటిక్ మూవీ 'మద్రాస్‌కారణ్' డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్దమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 7 నుంచి తమిళ భాషలో స్ట్రీమింగ్ కాబోతోన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీలో "కాదల్ సడుగుడు" అనే పాటలో నిహారిక బోల్డ్ పెర్ఫార్మన్స్తో రెచ్చిపోయింది. హీరోషేన్ నిగమ్ తో రొమాంటిక్ స్టెప్పులేసింది నిహారిక. ఈ సాంగ్‌లో వీరిద్దరూ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలిచిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతూ ట్రెండ్ చేశారు.


Click it and Unblock the Notifications











