నిహారిక కొత్త ప్రయాణం.. ఆ ఫొటోతో సర్‌ప్రైజ్ చేసిన మెగా డాటర్
మెగా ఫ్యామిలీ నుంచి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన ప్రత్యేకమైన శైలితో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. అయితే, నటిగా మంచి టాలెంట్ చూపించినా.. ఫలితాలు మాత్రం ఆశించినట్లుగా రాకపోవడంతో ఆమె సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం మళ్లీ ఈ ఫీల్డులో యాక్టివ్ అయిపోయింది. ఇందులో భాగంగానే వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిహారిక కొణిదెల మరో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతుంది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
అప్పట్లోనే అలా మెప్పించి:నిహారిక టీనేజ్‌లోనే 'ఢీ' షోతో యాంకర్‌గా ఎంటరైంది. ఆ తర్వాత 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి.. 'ముద్దపప్పు ఆవకాయ్', 'నాన్న కూచీ' అనే వెబ్ సిరీస్‌లను చేసింది. ఈ క్రమంలోనే 'ఒక మనసు' మూవీతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత 'హ్యాపీ వెడ్డింగ్', 'సూర్యకాంతం' మూవీలు చేసింది. కానీ, ఇవేమీ నిహారికకు సక్సెస్‌ను ఇవ్వలేదు.

విడాకుల తర్వాత స్పీడ్‌గా:హీరోయిన్‌గా కొన్ని సినిమాల్లో నటించిన నిహారికకు హిట్ రాకపోవడంతో కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ సమయంలోనే చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడింది. అప్పుడు యాక్టింగ్ కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత మళ్లీ నటనను మొదలు పెట్టింది. అలా ఈ మధ్య కాలంలో పలు వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించింది.
నిహారిక మరొక ప్రయాణం:ఈ మధ్య కాలంలో నిహారిక కొణిదెల స్పీడు పెంచేసి మరీ కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఇలా ఇప్పటికే కొన్ని వెబ్ సిరీస్‌లతో పాటు పలు చిత్రాలకు సైతం సంతకం పెట్టేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆహాలో ప్రసారం కాబోతున్న 'చెఫ్ మంత్ర' షోను హోస్ట్ చేయబోతుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

శ్రీముఖి.. లక్ష్మి తర్వాత:ఆహా ప్లాట్‌ఫాంలో 'చెఫ్ మంత్ర' అనే సెలెబ్రిటీల వంటల ప్రోగ్రాం చాలా రోజుల నుంచే వస్తోంది. మొదటి సీజన్‌ను శ్రీముఖి హోస్ట్ చేయగా.. రెండో దాన్ని మంచు లక్ష్మి ప్రసన్న నడిపించింది. ఇక, మూడో సీజన్‌ను నిహారిక హోస్ట్ చేయబోతుంది. ఈ మేరకు ఆమె పోస్టర్‌ను కూడా ఆహా సంస్థ విడుదల చేసింది. దీంతో నిహారిక కొత్త ప్రయాణానికి అందరూ శుభాకాంక్షలు చెప్తున్నారు.
ఆరోజు నుంచే ప్రారంభం:ఆహాలో 'చెఫ్ మంత్ర' షో రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇవి మంచి ఆదరణను అందుకుని సక్సెస్ సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో సీజన్‌ను మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఇందులో గతంలో కంటే ఎక్కువ ఫన్, గాసిప్స్‌తో పాటు డెలీషియస్ రిసిపీలను పరిచయం చేయబోతున్నామని ఆహా టీమ్ ప్రకటించింది.

ఆహా ఏం చెప్పిందంటే:'చెఫ్ మంత్ర' మూడో సీజన్‌కు సంబంధించిన ప్రకటనలో ఆహా టీమ్ 'నిహారిక కొణిదెల నుంచి మీకు సరదా సంభాషణలు, రసవత్తరమైన గాసిప్‌లు అందబోతున్నాయి. ఈ సీజన్ అంతా వినోదం, ఆటలు, రుచికరమైన వంటకాలతో నడవబోతుంది' అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ సీజన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











