OTTలోకి నిఖిల్ హీరోయిన్ కొత్త సీరీస్... ఎందులో స్ట్రీమింగ్ అవనుందంటే?

ఓటీటీ ప్రేక్షకులను వారం వారం కొత్త కొత్త సినిమాలు, సిరీసులు అలరిస్తూనే ఉంటాయి. అయితే మరో కొత్త సిరీస్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయింది. అదేంటో కాదు.. అవికా గోర్ నటించిన వధువు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరైన అవికా గోర్.. ఇప్పుడు వధువు అనే వెబ్ సిరీస్ తో ముందుకు రాబోతుంది. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. ఇక ఈ సిరీస్ ఎప్పుడు, ఎక్కడు స్ట్రీమింగ్ అవనుందనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియల్ తో బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అవికా గోర్. ఈ సీరియల్ మొదట హిందీలో ప్రసారం అయి ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులోకి డబ్ చేసి.. రిలీజ్ చేశారు. ఇక ఈ సీరియల్ కు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ సిీరియల్ తర్వాత ఈ భామకు తెలుగులో ఓ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

Nikhil Heroine Avika Gor Vadhuvu Movie Going To Streaming on Disney Plus Hotstar Full Details Here

ఇక రాజ్ తరుణ్ తో కలిసి నటించిన అవికా గోర్.. ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతో ఆ భామకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో తన అభినయంతో మెప్పించింది. నాగశౌర్యతో కలిసి లక్ష్మీ రావే మా ఇంటికి, రాజ్ తరుణ్ తో కలిసి సినిమా చూపిస్తా మావా, నిఖిల్ తో కలిసి ఎక్కడికి పోతవు చిన్నవాడా అనే సినిమాల్లో నటించింది. ఇక వరుస ఆఫర్లతో ఈ భామ సినిమాలు చేస్తూ దూసుకుపోయింది.

ఇక ఈ మధ్య ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక ఓటీటీ కంటెంట్ పై దృష్టి పెట్టింది. తాజాగా మ్యాన్షన్ 24 అనే వెబ్‌ సిరీస్‍ లో నటించి మెప్పించింది. ఈ సిరీస్ లో అవికా త‌న న‌ట‌న‌తో అల‌రించింది. ఈ సిరీస్ కూడా డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీరిస్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మొదటి సారిగా ఓటీటీ కంటెంట్ లోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్ మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఇదే బాటలో మరో సిరీస్ చేసేందుకు ముందుకు వచ్చింది.

Nikhil Heroine Avika Gor Vadhuvu Movie Going To Streaming on Disney Plus Hotstar Full Details Here

తాజాగా అవికా మరో ఓటీటీ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఆమె న‌టిస్తున్న తాజా వెబ్ సిరీస్ 'వ‌ధువు'. దీనికి మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్ గా పెట్టారు. కాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. దీపావ‌ళి కానుక‌గా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ ను గ‌మ‌నిస్తే.. పెళ్లి కూతురు గెట‌ప్‌ లో ఆవేదనగా కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లుగా అవికా కనిపిస్తుంది.

ఇక వధువు సిరీసులో బిగ్‍ బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ డిస్నీ+ హాట్‍ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ ప్రకటించారు. అయితే ఈ సిరీస్ విడుద‌ల తేదీని మాత్రం రివిల్ చేయలేదు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు మేకర్స్. ఈ సిరీస్ పోస్టర్ చూస్తుంటే.. థ్రిల్లర్ జోనర్ లాగా కనిపిస్తుంది. మరో థ్రిల్లర్ ఓటీటీలో వచ్చేందుకు రెడీ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X