twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 OTTలో వచ్చేది అప్పుడే.. స్పెషల్ డేట్ ఫిక్స్.. ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే?

    |

    నిఖిల్ సిద్ధార్థ నటించిన కార్తికేయ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎప్పుడు లేనంత భారీ స్థాయిలో నిఖిల్ మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది అనే విషయంలో చాలా రకాల రూమర్స్ అంటే వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల చిత్ర నిర్మాతలు చర్చలు జరిపిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎందులో స్ట్రీమింగ్ కాబోతోంది అనే వివరాల్లోకి వెళితే..

    వాయిదా పడుతూ

    వాయిదా పడుతూ

    2014లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 అసలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుందా లేదా అనే అనుమానాలు చాలానే వచ్చాయి. ఎందుకంటే అంతకుముందే సినిమా చాలాసార్లు వాయిదా పడింది. దాదాపు నెల రోజులపాటు ఈ సినిమా విడుదల పై కొంత సస్పెన్స్ క్రియేట్ అయిన సమయంలో అసలు సక్సెస్ కాదేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఆగస్టు 13వ తేదీన ఎట్టకేలకు వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలోనే విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.

     హిందీలో కూడా..

    హిందీలో కూడా..

    పాజిటివ్ టాక్ తోనే మంచి ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా హిందీలో ఎక్కువ థియేటర్లలో విడుదల చేయలేదు. ఇక రిలీజ్ డేట్ రోజు పాజిటివ్ టాక్ రావడంతో మూడవ రోజు నుంచి 1000 థియేటర్లకు పెరగడం విశేషం. ఇక తర్వాత ఆ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే వచ్చింది. రెండు మూడు వారాలపాటు కార్తికేయ సినిమా హిందీ మార్కెట్లో కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

    బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు

    బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు

    మొత్తానికి కార్తికేయ 2 సినిమా పెట్టిన పెట్టుబడికి అయితే నిర్మాతలకు భారీ స్థాయిలో లాభాలను అందించింది. అలాగే డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ సినిమా మంచి ప్రాఫిట్ అందించింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద వందకోట్ల కలెక్షన్స్ అందుకొని నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా విజయంతో కార్తికేయ టైటిల్ తో ఫ్రాంఛైజ్ కథలు ఇంకా వస్తాయని దర్శకుడు చందు మొండేటి వివరణ ఇచ్చాడు.

     ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేంజ్

    ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేంజ్

    అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తుంది అనే విషయంలో అనేక రకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి ఇప్పుడు సినిమాకు సంబంధించిన ఓటీటీ విడుదల తేదీ పై క్లారిటీకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అసలైతే సెప్టెంబర్ చివరిలోనే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ మళ్ళీ ఆ ప్రణాళిక చేంజ్ అయింది.

    న్యూ ఓటీటీ డేట్

    న్యూ ఓటీటీ డేట్

    దసరా ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అక్టోబర్ 5వ తేదీన జి 5 లో కార్తికేయ 2 సినిమా స్ట్రీమింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసమైతే మొదట అమెజాన్ ప్రైమ్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసినప్పటికీ భారీ ధరకు జి 5 సొంతం చేసుకుంది. మరి బాక్సాఫీస్ వద్దా సాలిడ్ కలెక్షన్స్ అందుకున్న కార్తికేయ 2 సినిమా ఓటీటీ లో ఇంకా ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

    English summary
    Nikhil Siddharth Karthikeya 2 movie ott date changed streaming platform details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X