For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthikeya 2 OTT రిలీజ్ లో ప్లాన్ చేంజ్.. ఫైనల్ గా సినిమా వచ్చేది ఎప్పుడంటే..

  |

  టాలీవుడ్ లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆగస్టు 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 సినిమా ఆ తర్వాత తొందరగానే హిందీలో కూడా విడుదలైంది. ఇక భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల ఓటీటీ రిలీజ్ డేట్ పై కూడా నిర్మాతలు ఒక డీల్ ఫిక్స్ చేసుకొని డేట్ కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

  ఆలస్యం అయినప్పటికీ

  ఆలస్యం అయినప్పటికీ


  నిఖిల్ సిద్ధార్థ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా 2014లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా తెరపైకి తీసుకువచ్చాడు. ఇక సినిమా విడుదలకు కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా మొత్తానికి ప్రేక్షకులను అయితే మెప్పించింది. ఇక విడుదలైన మొదటి రోజు నుంచి కూడా దాదాపు 25 రోజుల వరకు ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటూ వచ్చింది.

  భారీగా ప్రాఫిట్స్

  భారీగా ప్రాఫిట్స్

  కార్తికేయ 2 సినిమా 27 రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు బయ్యర్స్ అందరికీ కూడా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలను అందించింది. ఇక నార్త్ ఇండియాలో ఏకంగా 14.5 కోట్లను ఆడుకోవడం విశేషం. మొత్తం వరల్డ్ వైడ్ చూసుకుంటే 56.21 కోట్ల షేర్, 114 కోట్లు గ్రాస్ అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 42.91 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ అయితే అందించింది.

  ఊహించని విధంగా..

  ఊహించని విధంగా..

  దాదాపు అన్ని భాషల్లో కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ భారీ స్థాయిలో అందుకుంటూ నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి ఊహించిన స్థాయిలో లాభాలను అందించింది. అసలు ఈ సినిమా ఈ స్థాయిలో రికార్డులను అందుకుంటుంది అని కూడా ఎవరు ఊహించలేదు. ఇక మొదటిసారి నిఖిల్ 100 కోట్ల సినిమాతో సక్సెస్ అందుకోవడం విశేషం. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ సినిమా అటు కంటెంట్ పరంగా ను ఇటు కమర్షియల్ గాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

  అప్పుడే రిలీజ్ చేయాలని..

  అప్పుడే రిలీజ్ చేయాలని..

  ఇక సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల వార్తలు అయితే ఇటీవల వైరల్ అయ్యాయి. మొదట ఆగస్టు చివరి నెలలోనే ఈ సినిమా ఓటీటీ లో రావచ్చు అని టాక్ అయితే వినిపించింది. కానీ సినిమా థియేటర్లో మంచి క్రేజ్ అందుకుంటూ ఉండటంతో నిర్మాతలు అప్పుడే ఓటీటీ లో విడుదల చేయకూడదని అని ఫిక్స్ అయ్యారు. ఇక మొత్తానికి ఇటీవల మెల్లగా కార్తికేయ కలెక్షన్లు కొంత తగ్గాయి.

  ఫైనల్ గా వచ్చేది ఎప్పుడంటే?

  ఫైనల్ గా వచ్చేది ఎప్పుడంటే?

  ఇక ఫైనల్ గా ఓటీటీలో విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని ఇటీవల నిర్మాతలు ఒక మంచి డీల్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జి5తో పాటు అమెజాన్ ప్రైమ్ కూడా ఈ సినిమా ఓటిటి హక్కుల కోసం బాగానే ప్రయత్నాలు చేశారు. ఇక ఫైనల్ గా జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఇక సెప్టెంబర్ 30వ తేదీ నుంచి కార్తికేయ 2 ఓటీటీలో సందడి చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్తికేయ 2కి కాల భైరవ సంగీతం అందించాడు.

  English summary
  Nikhil Siddharth Karthikeya 2 movie ott release date update
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X