twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2 OTT: కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పుడు? ఎక్కడంటే?

    |

    టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తొలిసారి జోడి కట్టిన చిత్రం కార్తికేయ 2. మరోసారి చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. 2014లో వచ్చిన కార్తికేయ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కొద్దిపాటు అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 సౌత్, నార్త్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఎంతగానే ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆరోజ నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త వినిపిస్తోంది.

    2014లో వచ్చిన కార్తికేయకు..

    2014లో వచ్చిన కార్తికేయకు..

    నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 మూవీ 2014లో వచ్చిన కార్తికేయకు సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను ఎంతో ఆసక్తిగా తెరపైకి తీసుకువచ్చాడు. ఇక సినిమా విడుదలకు కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా మొత్తానికి ప్రేక్షకులను అయితే మెప్పించింది. ఇక విడుదలైన మొదటి రోజు నుంచి కూడా మంచి కలెక్షన్స్ అందుకుంటూ సత్తా చాటింది.

    ఊహించని స్థాయిలో విజయం..

    ఊహించని స్థాయిలో విజయం..

    దాదాపు అన్ని భాషల్లో కూడా బాక్సాఫీస్ కలెక్షన్స్ భారీ స్థాయిలో అందుకుంటూ నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి ఊహించిన స్థాయిలో లాభాలను అందించింది. అసలు ఈ సినిమా ఈ స్థాయిలో రికార్డులను అందుకుంటుంది అని ఎవరు కూడా ఊహించలేదు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టరీ సినిమా అటు కంటెంట్ పరంగా ను ఇటు కమర్షియల్ గాను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

    విడుదలపై అనేక వార్తలు..

    విడుదలపై అనేక వార్తలు..

    ఇక సినిమాను ఓటీటీలో ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా అనేక రకాల వార్తలు అయితే ఇటీవల వైరల్ అయ్యాయి. మొదట ఆగస్టు చివరి నెలలోనే ఈ సినిమా ఓటీటీ లో రావచ్చు అని టాక్ అయితే వినిపించింది. కానీ సినిమా థియేటర్లో మంచి క్రేజ్ అందుకుంటూ ఉండటంతో నిర్మాతలు అప్పుడే ఓటీటీ లో విడుదల చేయకూడదని ఫిక్స్ అయ్యారు. ఇక మొత్తానికి ఇటీవల మెల్లగా కార్తికేయ కలెక్షన్లు కొంత తగ్గాయి.

    అమెజాన్ ప్రైమ్ డీల్, కానీ..

    అమెజాన్ ప్రైమ్ డీల్, కానీ..

    దీంతో ఫైనల్ గా ఓటీటీలో విడుదల చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని ఇటీవల నిర్మాతలు ఒక మంచి డీల్ సెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జీ5తో పాటు అమెజాన్ ప్రైమ్ కూడా ఈ సినిమా ఓటిటి హక్కుల కోసం బాగానే ప్రయత్నాలు చేశారు. ఇక ఫైనల్ గా జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే విడుదల తేదిలో మాత్రం రెండు డేట్స్ అనుకున్నట్లుగా తెలుస్తోంది.

    దసరా కానుకగా ఆరోజు నుంచి..

    దసరా కానుకగా ఆరోజు నుంచి..

    దసరా కానుకగా అక్టోబర్ 5 లేదా అక్టోబర్ 7న ఈ మూవీనీ ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం కార్తికేయ 2 చిత్రాన్ని జీ5లో అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రంలో వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కార్తికేయ 2కి కాల భైరవ సంగీతం అందించాడు.

    English summary
    Nikhil Siddharth And Anupama Parameswaran Starrer Karthikeya 2 Movie OTT Release Date Confirmed News Goes Viral. This Movie Will Streaming From October 5 In Zee5.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X