Karthikeya 2 OTT Rights: విడుదలకు ముందే నిఖిల్ సినిమాకు అదిరిపోయే డీల్?
యంగ్ హీరో నిఖిల్ ఎక్కువగా డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ఆకట్టుకుంటూ తన మార్కెట్ ను కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నిఖిల్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అయింది. 2019లో చివరగా అర్జున్ సురవరం అనే సినిమాతో వచ్చిన నిఖిల్ బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనే విధంగా మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో సక్సెస్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. జూలై 22వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
2014లో కార్తికేయ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న నిఖిల్ మళ్ళీ ఇన్నాళ్లకు ఆ సినిమాతో సీక్వెల్ తో తన మార్కెట్ ను మరింత పెంచుకోవాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల విడుదల చేయగా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. చిత్ర యూనిట్ సభ్యులు అయితే ప్రస్తుతం ఏ మాత్రం గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చందు మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేయగా సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ ద్వారా నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి ముందుగానే టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ గా ఈ సినిమా దాదాపు 20 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. చాలా వరకు నిర్మాతలు ఈ సినిమాను మంచి రేటుకు అమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఓటీటీ ద్వారా కూడా ఈ సినిమాకు మంచి ప్రాఫిట్స్ వచ్చినట్లు సమాచారం.
ఓటిటి డిజిటల్ శాటిలైట్ హక్కుల రూపంలో కూడా కార్తికేయ 2 సినిమాకు దాదాపు 16 కోట్ల వరకు లాభం వచ్చినట్లు సమాచారం. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేయబోతున్నారు. ఒక విధంగా నిఖిల్ ఈ సినిమాతో అత్యధిక ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది. అడ్వెంచర్ ఫిలిమ్ కాబట్టి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా రెండు మూడు వారాల వరకు మంచి కలెక్షన్స్ తో అందుకునే అవకాశం ఉంటుంది. మరి మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











