SPY Movie OTT: ఆ ఓటీటీలోనే స్పై మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలిస్తే!
బ్యాగ్రౌండ్ లేకుండానే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. మినిమమ్ గ్యారెంటీ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు ఏకంగా మూడు నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో భాగం అయ్యాడు. ఈ క్రమంలోనే నిఖిల్ సిద్దార్థ్ ఇప్పుడు 'స్పై' అనే సినిమాలో నటించాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నిఖిల్ సిద్దార్థ్ హీరోగా ప్రముఖ ఎడిటర్ గ్యారీ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రమే 'స్పై'. ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా భారీ స్థాయిలో అయితే దక్కుతోంది. దీంతో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'స్పై' మూవీ ఓటీటీ డీల్ గురించి, స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి.

ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ మిస్టరీ డెత్‌ను టచ్ చేస్తూ తెరకెక్కిన 'స్పై' మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలిసింది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారని సమాచారం. అంటే జూన్ 29న విడుదలైన 'స్పై' ఆగస్టు 3వ వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందనే టాక్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది.

గ్యారీ దర్శకత్వంలో నిఖిల్ నటించిన 'స్పై' మూవీలో ఐశ్వర్య మీనన్, సనయా ఠాకూర్ హీరోయిన్లుగా నటించారు. అభినవ్ గోమటం, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రలను చేశారు. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. దీనికి శ్రీ చరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











