మరో పాన్ ఇండియా సినిమాతో సిద్దమవుతున్న నిఖిల్.. డిజిటల్ రైట్స్ తో షాక్ ఇచ్చాడుగా..

కార్తికేయ 2 సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఆ తరువాత పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడు అనేది అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. కార్తికేయ చిత్రం ఎన్నో అవార్డులను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మరెన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రం తర్వాత నిఖిల్ ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. స్పై అనే చిత్రంతో అందరినీ అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. అయితే స్పై కూడా.... కార్తికేయ-2 లాగే యూనివర్సల్ అప్పీల్ కలిగి ఉంటుందట.

యూనిక్ పాయింట్‌తో ఈ సినిమా బహుభాషా చిత్రంగా రూపొందుతోంది. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమా ద్వారానే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే చరణ్‌ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ఎడ్ ఎంటర్ టైన్ మెంట్స్ పై కె రాజశేఖర్ రెడ్డి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Nikhil Siddharth

ఈ సినిమా గ్లింప్స్, పోస్టర్ లకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రష్ ని చూసి, ఔట్ పుట్ నచ్చడంతో అత్యంత ధరకు సినిమా హక్కులను అమ్ముడైనట్లు తెలుస్తోంది.

స్పె సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ ధరకు అమ్ముడయ్యాయి. అమెజాన్ స్టార్ నెట్‌వర్క్ కలిసి ఈ చిత్రం యొక్క పూర్తి నాన్-థియేట్రికల్ హక్కులను రూ. 40 కోట్లకు పొందాయి. హీరో నిఖిల్ కెరియర్ లో ఇంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన చిత్రాలు ఏవీ లేదు. ఇదే మొదటిది. నిఖిల్ సరసన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటిస్తోంది. ఆర్యన్ రాజేష్ ఈ సినిమా ద్వారానే రీఎంట్రీ ఇచ్చి ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ ఇలా.. ఐదు భాషల్లో విడుదలయ్యే పూర్తి యాక్షన్-ప్యాక్డ్ స్పై థ్రిల్లర్‌గా రూపొందించబడిన ఈ చిత్రానికి నిర్మాత కె రాజశేఖర్ రెడ్డి కథను కూడా అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X