twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthikeya 2: ఓటీటీలో కూడా సంచలన రికార్డ్ క్రియేట్ చేసిన నిఖిల్ మూవీ.. ఆ సంస్థ పంట పండింది!

    |

    నిఖిల్ సిద్దార్థ్ నటించిన కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా మొత్తానికి ఆగస్టు 13 వ తేదీన పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. పోటీగా అమీర్ ఖాన్ సినిమా ఉన్నప్పటికీ కూడా కార్తికేయ 2 ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

    ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 120 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని రికార్డు క్రియేట్ చేసింది. అసలు ఈ రేంజ్ లో సినిమా సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. శ్రీకృష్ణ మిస్టరీ బ్యాగ్రౌండ్ లో తెరపైకి వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా సినిమాను చాలా బాగా తెరపైకి తీసుకువచ్చారు అని చిత్ర యూనిట్ సభ్యులపై కూడా ప్రశంసలు కురిసాయి.

    Nikhil Siddhartha Karthikeya 2 movie sensational record in ott platform

    ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాను చూసి ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఇప్పుడు ఓటీటీ లో విడుదలవగా కార్తికేయ 2 సినిమా అక్కడ కూడా సరికొత్త రికార్డు స్థాయిలో రెస్పాన్స్ అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న జీ 5 సంస్థ పంట కూడా పండింది అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఈ సంస్థ కొనుగోలు చేసిన సినిమాలు అన్నీ కూడా తీవ్రంగా నిరాశపరిచాయి.

    కానీ ఇప్పుడు కార్తికేయ 2 సినిమా ద్వారా జి5కు ఆడియన్స్ సంఖ్య కూడా పెరిగింది. ఇక మొత్తంగా 48 గంటల్లోనే కార్తికేయ సినిమా 100 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. జనాలు ఏ స్థాయిలో ఈ సినిమాను చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చందు మొండేటి దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ సినిమాలో నిఖిల్ కు జోడిగా అనుపమ పరమేశ్వరన్ నటించగా అనుపమ్ ఖేర్ ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఇక కార్తికేయ 2 సినిమాకు భవిష్యత్తులో మరిన్ని ఫ్రాంఛైజ్ కథలు కూడా పుట్టుకొస్తాయని దర్శకుడు చందు క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక భవిష్యత్తులో రాబోయే కార్తికేయ 3 సినిమా మాత్రం భారీ స్థాయిలో భారీ బడ్జెట్లో తెరపైకి రావచ్చు అని తెలుస్తోంది.

    English summary
    Nikhil Siddhartha Karthikeya 2 movie sensational record in ott platform
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X